త‌న సినిమా గురించి ఎగ్జ‌యిట్ అవుతున్న క్రికెట‌ర్‌

క్రికెట్ త‌ర‌పున ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించిన అంద‌రూ త‌ర్వాత కామెంటేట‌ర్స్‌గానో, సెల‌క్ట‌ర్స్‌, కోచ్‌లు లేక‌పోతే బిజినెస్‌మేన్‌లుగా మాతుంటారు. ఆ కోవ‌లో స్టార్ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా ముందుకెళుతుండేవారు. అయితే రీసెంట్‌గా ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొత్త ట‌ర్న్ తీసుకున్నారు. ఆయ‌న హీరోగా న‌టిస్తుండ‌టం విశేషం. అది కూడా ఓ ద‌క్షిణాది సినిమాలో ఫ్రెండ్‌షిప్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో ఇద్ద‌రు వ్య‌క్తుల చేతుల‌కు బేడీలు వేసున్నారు. అలాగే తొలిసారి ఓ ప్ర‌ముఖ ఇండియ‌న్ క్రికెట‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని అందులో రాయ‌డం విశేషం.

ఇది వ‌ర‌కే హ‌ర్భ‌జ‌న్ కొన్ని సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే పూర్తిస్థాయి హీరోగా మాత్రం ఆయ‌న ద‌క్షిణాదిన త‌మిళ చిత్రం ద్వారానే ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ఈ చిత్రాన్ని జేపీఆర్ స్టాలిన్ నిర్మిస్తున్నారు. మ‌రి ఈ సినిమాకు భ‌జ్జీ త‌నే డ‌బ్బింగ్ చెప్పుకున్నాడా? అని మాత్రం తెలియ రావ‌డం లేదు. త‌న సినిమా గురించిన పోస్టర్‌ను హ‌ర్భ‌జ‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. భ‌జ్జీ తొలిసారి హీరోగా న‌టిస్తుండ‌టం.. అది కూడా త‌మిళ చిత్రం కావ‌డంతో చాలా ఎగ్జ‌యిట్ అవుతున్న‌ట్లు తెలుస్తుంది.

మ‌న దేశం త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్స్‌లో హ‌ర్భ‌జ‌న్ రెండో స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ న‌టి గీతా బ‌స్రాను పెళ్లి చేసుకున్నాడు భ‌జ్జీ..టీవీ షోల్లో క‌నిపిస్తున్నాడు. మ‌రో ప‌క్క చెన్నై త‌ర‌పున ఐపీఎల్‌కి కూడా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

More News

ప‌వ‌న్‌తో యంగ్ డైరెక్ట‌ర్‌?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌ను చేసుకుంటూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే పింక్ రీమేక్‌తో పాటు..

అజయ్ భూపతి 'మహాసముద్రం' ఆలస్యానికి కారణమిదేనా?

'ఆర్ఎక్స్ 100' సినిమాలో లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. అందుకే, అన్ని వర్గాల జనం ఆదరించారు.

అలీకి గుడ్ న్యూస్.. పవన్ నుంచి పిలుపు..!?

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి కమెడియన్ కమ్ వైసీపీ నేత అలీకి పిలుపు పోయిందట.

RIP అంటూ హీరోయిన్‌పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్!

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి మరోసారి వార్తల్లో నిలిచింది. నిత్యం వివాదాలే ఊపిరిగా బతుకుతున్న శ్రీరెడ్డి ఎవర్ని పడితే వార్ని గోకుతూ హడావుడి చేస్తుంటుంది.

కాజ‌ల్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంద‌ట‌...!

టాలీవుడ్‌లో 12 ఏళ్ల క్రితం `ల‌క్ష్మీక‌ళ్యాణం` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.