క్రేజీ విలన్ ఇల్లు సీజ్ చేసిన అధికారులు.. వణుకు పుట్టించే రీజన్!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక వేవ్ తర్వాత మరో వేవ్ ఇలా ప్రజలపై కరోనా దాడి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది.
ముంబైలో అలర్ట్ అయిన అధికారులు థర్డ్ వేవ్ ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అక్కడక్కడా బయట పడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముంబైలోని మౌంట్ రోడ్ లో పృథ్వీ అపార్ట్మెంట్స్ లో 18వ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నారు.
సునీల్ శెట్టి ఫ్యామిలీ మొత్తం అక్కడే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్ మెంట్ లో మూడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయట పడ్డాయి. దీనితో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మున్సిపల్ అధికారులు ఆ అపార్ట్మెంట్ మొత్తాన్ని సీజ్ చేశారు. కేసుల వ్యాప్తిని అడ్డుకునేందుకు, కోవిడ్ నిబంధనల ఆధారంగా ఆ భవనాన్ని సెజ్ చేసినట్లు బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ గైక్వాడ్ తెలిపారు.
అయితే సునీల్ శెట్టి కుటుంబం మాత్రం క్షేమంగానే ఉంది. అపార్ట్మెంట్ సీజ్ కావడంతో సునీల్ శెట్టి తన ఫ్యామిలీతో మరో ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు. సునీల్ శెట్టి బాలీవుడ్ లో విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నారు. సౌత్ లో కూడా పలు చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. రజనీకాంత్ దర్బార్ చిత్రంలో సునీల్ శెట్టి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments