క్రేజీ కాంబినేషన్ మరోసారి!!
Send us your feedback to audioarticles@vaarta.com
మిరపకాయ్‌తో సూపర్‌డూపర్ హిట్.. గబ్బర్‌సింగ్‌తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న డైరెక్టర్ హరీశ్ శంకర్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన చిత్రం ‘గద్దల కొండ గణేష్’. 2019లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ మరోసారి పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో సినిమా చేయడానికి 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట సిద్ధమయ్యారు.
"గద్దలకొండ గణేష్’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాం. ఇప్పుడు మరోసారి పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌గారితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పనిచే్యబోతున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం’" అంటూ రామ్ ఆచంట, గోపీ ఆచంట తెలిపారు. అయితే ఈసారి స్ట్రయిట్ మూవీ చేస్తారా? లేక రీమేక్ మూవీ చేస్తారా అని తెలియడం లేదు.
వీరి కాంబినేషన్‌లో రూపొందిన గద్దల కొండ గణేష్ 2019 సెప్టెంబర్‌లో విడుదలైంది. ఈ చిత్రం తమిళ సినిమా జిగర్ తండాకు రీమేక్. తెలుగులో 42 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూళ్లు చేసి వరుణ్ తేజ్‌కి మంచి హిట్ మూవీగా నిలిచింది. మరి ఈసారి హరీశ్ డైరెక్ట్ చేసే హీరో ఎవరనే దానిపై క్లారిటీ రావాలంటే సమయం పట్టేలానే ఉంది. పవన్‌తో సినిమా స్టార్ట్ కావడానికి మరింత సమయం పట్టేలా ఉండటంతో ఈ గ్యాప్‌లో హరీశ్ ఓ సినిమా చేయడానికి రెడీ అయిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com