క్రేజీ కాంబినేషన్...!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. తదుపరి సినిమా ఏంటనే దానిపై క్లారిటీ లేదు. అనుష్క పలానా చిత్రంలో నటిస్తుందంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలే వినిపించాయి. కానీ అనుష్క సైడ్ నుండి ఎలాంటి కన్‌ఫర్మేషన్ రాలేదు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈమె నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. దీని తర్వాత రెండు సినిమాలు ఓకే చేశానని, త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తానని ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆ సినిమా ఏంటనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం మేరకు జేజెమ్మ, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా రూపొందనుంది. డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తాడని, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలోనూ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీబిజీగా ఉన్న సమయంలో ఒకవేళ అనుష్కతో సినిమాకు ఓకే చెప్పినా, మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుని డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వచ్చిన అనుష్క ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఎలాంటి సినిమా చేస్తుందనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com