కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్(34) కరోనాతో కన్నుమూశారు. రెండు వారాల క్రితం ఆశిష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన చికిత్స నిమిత్తం హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేరారు. కానీ ఆ తరువాత ఆయన పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆశిష్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆశిష్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘‘కరోనా బారిన పడి నా పెద్ద కుమారుడు ఆశిష్ ఈ ఉదయం మృతి చెందాడన్న విషయం తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. మా కుమారుడిని బతికించేందుకు శ్రమించి చికిత్సను అందించిన వైద్య బృంధానికి, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి, ఈ కష్ట కాలంలో మాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఆశిష్ ఏచూరి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments