కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి

  • IndiaGlitz, [Thursday,April 22 2021]

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్(34) కరోనాతో కన్నుమూశారు. రెండు వారాల క్రితం ఆశిష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన చికిత్స నిమిత్తం హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చేరారు. కానీ ఆ తరువాత ఆయన పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆశిష్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆశిష్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు.

‘‘కరోనా బారిన పడి నా పెద్ద కుమారుడు ఆశిష్ ఈ ఉదయం మృతి చెందాడన్న విషయం తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. మా కుమారుడిని బతికించేందుకు శ్రమించి చికిత్సను అందించిన వైద్య బృంధానికి, ఫ్రంట్‌లైన్ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి, ఈ కష్ట కాలంలో మాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. ఆశిష్ ఏచూరి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

More News

అల్లు అర్జున్ గురించి దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్‌లో సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిపోయింది. సినిమాకు టైటిల్ మోషన్ పోస్టర్ సైతం విడుదలైంది.

న్యాయం కోరుతూ యువకుడి ట్వీట్.. క్షణాల్లో స్పందించిన సీపీ

తన తల్లిని తండ్రి చంపేందుకు యత్నిస్తున్నాడంటూ ఓ యువకుడు తల్లితో కలిసి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఆక్సీజన్ లీక్.. సరఫరా నిలిచిపోవడంతో 22 మంది మృతి

కోవిడ్-19 విజృంభణతోపాటు ప్రాణవాయువు కొరత వేధిస్తున్న సమయంలో ఆక్సిజన్ లీక్ అయింది.

ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే: టీటీడీ

శ్రీరాముడికి అత్యంత ప్రియ భక్తుడైన ఆంజనేయుని జన్మ రహస్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం..

దేశంలో ఈ స్థాయిలో కేసులు.. మరణాలు ఇదే తొలిసారి

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.