Telangana Formation Day: తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు.. ఫలితం మాత్రం కేసీఆర్ ఖాతాలోకే: సీపీఐ నారాయణ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణా ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలంగాణ కోసం ఎంతోమంది కృషి చేసినా ఫలితం మాత్రం టీఆర్ఎస్ , కేసీఆర్ ఖాతాలోనే పడిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే నేటీ మంత్రివర్గంలో ఒకరిద్దరు తప్ప మిగిలిన మంత్రులంతా ఆనాడు ప్రత్యేక తెలంగాణా వాదాన్ని వ్యతిరేకించిన వారేనని నారాయణ చురకలు వేశారు. ప్రత్యేక తెలంగాణా వాదానికి కేంద్రబిందువైన ఒకప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం నేడు పాలకవర్గానికి శత్రు శిబిరంగా మారిపోయిందని నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భూకుంభకోణాలు, మాఫియా దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని.... పోలీస్ వ్యవస్థ వారికే వత్తాసు పలకడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు కేంద్రంలోని బీజేపీ పాలనపై నిప్పులు కురిపిస్తూనే ఆచరణలో కేంద్ర విధానాలను చాపకింద నీరులాగా అమలు చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన సందర్బం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు . ప్రధాని పదవి , ముఖ్యమంత్రి పదవిని ప్రజలిచ్చారని.. ఆహక్కును వినియోగించుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని నారాయణ ఫైరయ్యారు. రాష్ట్రావతరణ సందర్బంగా కొన్నిచేదు నిజాలు వెలిబుస్తూనే సాధించాల్సిన అంశాలపై ప్రజాస్వామ్య శక్తులు ఉద్యమించినప్పుడే అమరవీరులకు న్యాయం చేసినవారమవుతామని నారాయణ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments