కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

  • IndiaGlitz, [Wednesday,April 28 2021]

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో ఈ మహమ్మారికి చెక్ పెట్టే కార్యక్రమం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దీనికోసం నేటి(బుధవారం) నుంచి కొవిన్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయాల్లో మాత్రం కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

కోవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్‌లలోనూ వ్యాక్సిన్ కోసం పేరు నమోదు చేసుకోవాలని మై గవర్నమెంట్ ఇండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది. పేరు నమోదు చేసుకున్న వారందరికీ మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్ ఖరారవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలకు ఇచ్చే టీకాలను 45 ఏళ్ల లోపు వారికి వినియోగించవద్దని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు కొనుగోలు చేసే వ్యాక్సిన్లను మాత్రమే 18-45 ఏళ్ల లోపు వారిని వినియోగించాలని కేంద్రం వెల్లడించింది.

టీకా నమోదు ఇలా..

కోవిన్ పోర్టల్‌లో లాగిన్ అయి.. మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. సదరు నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీని ఎంటర్ చేసి.. వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది.

దాంట్లో మన ఫోటో ఉన్న గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసిన రిజిష్టర్ బటన్‌పై క్లిక్ చేయాలి.

రిజిస్ట్రేరషన్ అయిన తరువాత టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకోవచ్చు. దీనికోసం షెడ్యూల్ బటన్‌పై క్లిక్ చేయాలి.

పిన్ కోడ్ ఎంటర్ చేసి వెతికితే.. దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా వస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకుని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే సౌలభ్యం కూడా ఉంది.

More News

అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభణ కొనసాగిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది.

దిల్ రాజుకు పవన్ మళ్లీ గ్రీన్ సిగ్నల్.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఏ దర్శక నిర్మాతకు ఉండదు? నిర్మాత దిల్ రాజుకైతే పవన్‌తో సినిమా చేసేందుకు చాలా కాలమే పట్టింది.

మే 3 వరకూ అమెరికా వీసాలకు బ్రేక్..

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

ఇండియా తనకు రెండో ఇల్లు అంటూ బ్రెట్‌లీ భారీ విరాళం

భారత్‌లో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.

కోవిడ్‌పై సమరానికి సిద్ధమైన ఏపీ.. జగన్ కీలక ఆదేశాలు..

కోవిడ్‌పై సమరానికి ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.