కరోనా వ్యాక్సిన్ 50 శాతం వ్యాప్తిని అరికడుతుందట..

  • IndiaGlitz, [Wednesday,April 28 2021]

కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం కరోనా బారిన పడుతుండటంతో పాటు.. పలువురు ఇతర కారణాల వల్ల వ్యాక్సిన్ వేయించుకున్న మరుసటి రోజో.. రెండు రోజుల వ్యవధిలోనో మరణిస్తుండటంతో దీనికి కారణం టీకాయేనని లేనిపోని అపోహలు సృష్టించుకుని వేయించుకునేందుకు భయపడుతున్నారు. అయితే ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వ్యాక్సిన్ విషయంలో కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. వ్యాక్సిన్ కరోనా బారి నుంచి రక్షించడమే కాకుండా వ్యాప్తిని సైతం తగ్గిస్తోందని గుర్తించారు.

ఒక డోసు తీసుకున్న మీదట ఆ వ్యక్తి కరోనా బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం 50 శాతం తగ్గినట్టేనని తేల్చి చెబుతున్నారు. తాజాగా పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ పరిశోధకులు ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై అధ్యయనం చేశారు. ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న మీదట కనీసం ఒకరు కరోనా బారిన పడిన 24 వేల కుటుంబాల్లో 57 వేల మంది వ్యాక్సిన్ తీసుకోని వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. అలాగే పది లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోని వారి సమాచారం ఈ ఫలితాన్ని పోల్చి చూడగా.. వ్యాక్సిన్ తీసుకున్న వారు కరోనా బారిన పడితే వారి కుటుంబ సభ్యులకు ముప్పు దాదాపు 50 శాతం తగ్గుతుందని తేలింది.

తొలి డోసు తీసుకున్న వ్యక్తి మూడు వారాల తర్వాత కరోనాబారిన పడితే వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకే ప్రమాదం 38-49 శాతం వరకూ తగ్గుతుందని గుర్తించారు. దీంతో టీకా వ్యాప్తిని తగ్గిస్తుందని తేలిందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హాన్‌కాక్ తెలిపారు. అయితే గతంల జరిపిన అధ్యయనాల్లో.. ఒక డోసు తీసుకున్న అనంతరం నాలుగు వారాల తర్వాత వైరస్ కారణంగా వచ్చే లక్షణాలు 65 శాతం తగ్గినట్టు తేలింది. బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ సత్ఫలితాలను ఇస్తోందని.. మార్చి చివరి నాటికి 60 ఏళ్లకు పైబడిన వారిలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

More News

'ఎదురీత' సెన్సార్ పూర్తి... త్వరలో విడుదలకు సన్నాహాలు

'సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఎదురీత'.

టీటీడీ తాత్కాలిక ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని తాత్కాలికంగా.. ఈవో కార్యకలాపాలు చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సేమ్ టు సేమ్ పెంపుడు కుక్కలతో సమంత, అనసూయ..

కుక్కలంటే అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మెగాస్టార్‌ని ఢీకొట్టబోతున్న స్టైలిష్ స్టార్?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎవరూ థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి.

కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో ఈ మహమ్మారికి చెక్ పెట్టే కార్యక్రమం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.