16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం..
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా పేర్కొంటున్న కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 16 నుంచి టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రం దేశ వ్యాప్తంగా ప్రారంభించనుంది. తొలి ప్రాధాన్యతా క్రమంగా సుమారు 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమీక్షించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించాలని మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్, ఆరోగ్య సిబ్బందికి.. ఆ తర్వాత 27 కోట్ల మంది 50 ఏళ్లు పైబడిన వారికి, అనంతరం ఒకటి లేదా అంతకు పైబడి వ్యాధులున్న వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా ఇండియా మరో చారిత్రక ముందుగు వేస్తోందని తెలిపారు.
రెండు స్వదేశీ టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ.. ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయగా.. మరోవైపు స్వదేశీ టీకా అత్యవసర వినియోగానికి సైతం కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఇటీవల దేశ వ్యాప్తంగా డ్రైరన్ చేపట్టిన కేంద్రం.. తాజాగా టీకా పంపిణీపై నిర్ణయం తీసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout