రేపు దేశమంతటా డ్రైరన్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వ్యాక్సినేషన్ సన్నద్ధతకు దేశమంతటా డ్రై రన్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహక చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా రాజేశ్ భూషణ్ వెల్లడించారు. కాగా.. ఈ సమావేశంలో టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లు.. ప్రణాళికను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలు తదితర విషయాలపై చర్చించారు.
డ్రై రన్‌ను ఈ నెల 2న నిర్వహించనున్నట్టు రాజేశ్ భూషణ్ వెల్లడించారు. దీని కోసం అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్య పట్టణాల్లో కనీసం మూడేసి చొప్పున కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహించేందకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఇందుకోసం తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్య పట్టణాల నుంచి పలు జిల్లాలకు కనెక్టివిటీ సరిగా లేదని.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మాత్రం రాజధాని నగరాలతోపాటు, ఇతర పట్టణాల్లోనూ డ్రైరన్ నిర్వహిస్తామన్నారు. కాగా.. గత నెల 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో తొలిదశ డ్రైరన్ నిర్వహించారు. మలిదశ డ్రై రన్‌ను రేపు నిర్వహించబోతున్నారు.
టీకా పంపిణీ డ్రైరన్ విషయంలో డిసెంబరు 20న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలే.. శనివారం జరిగే డ్రైరన్ సందర్భంగానూ పాటించాల్సి ఉంటుందని రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు ఈ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో 25 మంది చొప్పున ఆరోగ్య కార్యకర్తలకు డ్రైరన్ వ్యాక్సిన్ వేయాలన్నారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం తయారు చేసిన కొ-విన్ యాప్‌లో డ్రైరన్-ఆరోగ్య కార్యకర్తల వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని రాజేశ్ భూషణ్ తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్లలో ప్రతి కేంద్రంలో వెయిటింగ్ రూమ్, టీకా స్టోరేజీలు ఎలా ఉండాలి? ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతను కొనసాగించాలో ఈ సందర్భంగా రాజేశ్ భూషణ్ వివరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments