రేపు దేశమంతటా డ్రైరన్

  • IndiaGlitz, [Friday,January 01 2021]

కరోనా వ్యాక్సినేషన్‌ సన్నద్ధతకు దేశమంతటా డ్రై రన్‌ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహక చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. కాగా.. ఈ సమావేశంలో టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లు.. ప్రణాళికను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలు తదితర విషయాలపై చర్చించారు.

డ్రై రన్‌ను ఈ నెల 2న నిర్వహించనున్నట్టు రాజేశ్ భూషణ్ వెల్లడించారు. దీని కోసం అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముఖ్య పట్టణాల్లో కనీసం మూడేసి చొప్పున కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహించేందకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఇందుకోసం తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్య పట్టణాల నుంచి పలు జిల్లాలకు కనెక్టివిటీ సరిగా లేదని.. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మాత్రం రాజధాని నగరాలతోపాటు, ఇతర పట్టణాల్లోనూ డ్రైరన్‌ నిర్వహిస్తామన్నారు. కాగా.. గత నెల 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌, అసోం, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో తొలిదశ డ్రైరన్‌ నిర్వహించారు. మలిదశ డ్రై రన్‌ను రేపు నిర్వహించబోతున్నారు.

టీకా పంపిణీ డ్రైరన్‌ విషయంలో డిసెంబరు 20న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలే.. శనివారం జరిగే డ్రైరన్‌ సందర్భంగానూ పాటించాల్సి ఉంటుందని రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు ఈ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో 25 మంది చొప్పున ఆరోగ్య కార్యకర్తలకు డ్రైరన్‌ వ్యాక్సిన్‌ వేయాలన్నారు. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం తయారు చేసిన కొ-విన్‌ యాప్‌లో డ్రైరన్‌-ఆరోగ్య కార్యకర్తల వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. వ్యాక్సినేషన్‌ సెంటర్లలో ప్రతి కేంద్రంలో వెయిటింగ్‌ రూమ్‌, టీకా స్టోరేజీలు ఎలా ఉండాలి? ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతను కొనసాగించాలో ఈ సందర్భంగా రాజేశ్ భూషణ్ వివరించారు.

More News

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వాయిదా వేస్తున్నాం: ఈటల

కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన ఇబ్బందులన్నీ ఇప్పుడిప్పుడే కాస్త తొలుగుతున్నాయని ఆనందించే లోపే.. కోవిడ్ కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసింది.

'మెగా' తప్పిదానికి క్షమాపణ చెప్పిన ఒటిటి సంస్థ

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. లాక్‌డౌన్ కాలంలో ప్రేక్షకులు కామన్‌గానే ఓటీటీలకు అలవాటు పడిపోయారు. దీంతో ‘ఆహా’

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

అనారోగ్యంతో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ సోమజిగూడా యశోద ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు.

రిపబ్లిక్ గిఫ్ట్ రెడీ చేస్తున్న రాజమౌళి

ద‌ర్శ‌కధీరుడు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న పిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది.

తేజ సినిమా నుండి తప్పుకున్న గోపీచంద్

హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ ఒకానొక ద‌శ‌లో స‌క్సెస్‌లు లేక ఖాళీగా కూర్చుంటే డైరెక్ట‌ర్ తేజ త‌న‌ని జ‌యం, నిజం వంటి సినిమాల్లో విల‌న్‌గా చూపించి త‌న‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చి