థర్డ్ వేవ్ దారుణంగా ఉంటుంది.. సౌత్ ఆఫ్రికా వేరియంట్ తో ప్రళయమే!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గక ముందే వైద్య నిపుణుల్లో థర్డ్ వేవ్ పై భయాందోనళలు మొదలయ్యాయి. ప్రముఖ కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్ ఓ డిబేట్ లో భయంకర విషయాలు వెల్లడించారు. థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుంది అని ప్రశ్నించగా భయంకరంగా ఉంటుంది అని అన్నారు.
ఇదీ చదవండి: గాంధీ ముని మనవరాలికి 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.3 కోట్ల చీటింగ్ చేసి..
నేను భయపెడుతున్నాను అనుకోండి ఏమైనా అనుకోండి.. కానీ ఇదే వాస్తవం. కరోనా ఫస్ట్ వేవ్ లో ఆ ఊర్లో కరోనా ఉంది ఈ ఊర్లో ఉంది అని మాట్లాడుకున్నాం . సెకండ్ వేవ్ లో ఆ వీధిలో చనిపోయారు ఈ వీధిలో చనిపోయారు అని మాట్లాడుకున్నాం. థర్డ్ వేవ్ మన ఇంట్లోకి రాబోతోంది అని అన్నారు.
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్న కరోనా వేరియంట్ పై ఎలాంటి వాక్సిన్ లు పనిచేయడం లేదని అన్నారు. అలాంటి వేరియంట్ ఇండియాలో ఉన్న వేరియంట్ తో మిక్స్ అయితే ఆ పరిస్థితులు ప్రళయాన్ని మించేలా ఉంటాయి అని అన్నారు. కరోనా వచ్చింది అని తెలుసుకునేలోపే పేషంట్ వెంటిలేటర్ పై ఉండాల్సి ఉంటుందని పరుచూరి మల్లిక్ అన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని మల్లిక్ తప్పుబట్టారు. అప్పుడే అన్ లాక్ లు మొదలు పెట్టారు. ఎవరి కోసం అన్ లాక్స్ ? వేల కోట్ల రూపాయలు పనికిరాని వ్యాక్సిన్స్ పై ఖర్చుచేయడం మానాలి. ప్రతి మండలంలో ఆక్సిజన్ ప్లాంట్స్ అవసరం.. ప్రతి మండలంలో వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాలి అని మల్లిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమయం ఎక్కువలేదు.. కేవలం నెల, రెండు నెలల వ్యవధిలో థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందని మల్లిక్ హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments