'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) పాట‌ల‌ను విడుద‌ల చేయ‌నున్న కొవిడ్ హీరోలు

  • IndiaGlitz, [Saturday,January 23 2021]

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా రూపొందుతున్న 'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

కాగా, ఈ సినిమా పాట‌ల‌ను విభిన్న త‌ర‌హాలో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. సాధార‌ణంగా సినిమా పాట‌ల‌ను సినిమా స్టార్ల‌తో రిలీజ్ చేస్తుంటారు. కానీ 'ఎఫ్‌సీయూకే' పాట‌ల‌ను కొవిడ్ హీరోలు రిలీజ్ చేయ‌నున్నారు. అవును. ఈ విష‌యాన్ని జ‌గ‌ప‌తిబాబు ఎనౌన్స్ చేశారు. అంద‌రినీ క్షేమంగా ఉంచ‌డానికి త‌మ జీవితాల్ని ప‌ణంగా పెట్టి, కొవిడ్‌పై అలుపెరుగ‌కుండా పోరాడుతూ వ‌స్తున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు సెల్యూట్ చేయాల‌నే స‌దుద్దేశంతో పాట‌ల విడుద‌ల‌కు వారిని ఆహ్వానించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో సందేశంలో ఆయ‌న, దేశ‌మంతా లాక్‌డౌన్‌లో ఉన్న కాలంలో, అంద‌రూ ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో ఒక్క‌రోజు కూడా వెనక‌డుగు వేయ‌కుండా నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన మెడిక‌ల్‌, పోలీసు, మునిసిప‌ల్, మీడియా సిబ్బంది కృషిని కొనియాడారు. వారి అసామాన్య సేవ‌ల‌కు గుర్తింపుగా ఒక్కో విభాగానికి చెందిన రియ‌ల్ హీరో చేతుల మీదుగా 'ఎఫ్‌సీయూకే' చిత్రంలోని ఒక్కో పాట‌ను విడుద‌ల చేయిస్తున్న‌ట్లు జ‌గ‌ప‌తిబాబు చెప్పారు.

ఇదివ‌ర‌కు ఈ వారం మొద‌ట్లో జ‌రిగిన 'ఎఫ్‌సీయూకే' టీజ‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, తాను ప‌నిచేసిన అత్యంత విల‌క్ష‌ణ చిత్రాల్లో ఈ సినిమా ఒక‌ట‌ని తెలిపారు. ఇది పూర్తి రొమాంటిక్ కామెడీ మూవీ అనీ, ఇందులో తాను చేసిన‌ ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ చాలా తృప్తినిచ్చింద‌నీ చెప్పారు. ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుంద‌ని ఆయ‌న‌న్నారు.

తారాగ‌ణం: జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

More News

ఫిబ్రవరి 11న గ్రేటర్‌లో ఏం జరుగుతుంది? టెన్షన్ టెన్షన్..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు ముగిసి నెలన్నర పైగా అవుతోంది.

తార‌క్ ట్రాఫిక్ చ‌లానా క‌ట్టిన ఫ్యాన్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒక‌రు... ఆయ‌న‌కు చిన్న‌పాటి షాకింగ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇంత‌కీ తార‌క్‌కు స‌ద‌రు అభిమాని ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్ ఏంటో తెలుసా..!.

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్‌ను పొరపాటున లీక్ చేసిన ఐరిష్ నటి..

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘.

పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ విజ్ఞప్తిని తోసి పుచ్చి ఎన్నికల కమిషన్ తొలి విడత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

జో బైడెన్ తొలి ప్రసంగం వెనుక తెలుగోడి ప్రతిభ..

దేశ 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10- 30 గంటలకు..