బ్రేకింగ్: రాష్ట్రాలకు కోవిడ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న కోవిడ్-19 ఫైనాన్షియల్ ప్యాకేజీలో భాగంగా సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.890.32 కోట్లను యూనియన్ గవర్నమెంట్ విడుదల చేసింది. కరోనా విపత్కర సమయంలో రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తొలి విడతగా ఏప్రిల్ 2020లో రూ.3000 కోట్ల రూపాలయను ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
వీటిని పరీక్ష సదుపాయాలను పెంచడానికి, ఆసుపత్రి మౌలిక వసతులు, నిఘా కార్యకలాపాలతో పాటు అవసరమైన పరికరాలు, మందులు ఇతర సామగ్రిని సేకరించడానికి వీలుగా అన్ని రాష్ట్రాలకు రూ.3000 కోట్లను విడుదల చేసింది. అలాగే ఈ ప్యాకేజీలో భాగంగా ఈ ప్యాకేజీలో భాగంగా.. 5,80,342 ఐసోలేషన్ పడకలు, 1,36,068 ఆక్సిజన్ సపోర్టెడ్ పడకలు, 31,255 ఐసీయూ పడకలతో రాష్ట్రాలను బలోపేతం చేశారు. తాజాగా సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ను సైతం కేంద్రం విడుదల చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments