అలెర్ట్: గాంధీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. థర్డ్ వేవ్ ప్రమాదం ఉంది!

  • IndiaGlitz, [Saturday,July 31 2021]

కరోనా మహమ్మారి మానవాళిని ఎప్పుడు వదిలిపెడుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొని ఉంది. వైద్య నిపుణులు సైతం కరోనాని బ్రేక్ చేసే మార్గం దొరకక తలలు పట్టుకుంటున్నారు. సెకండ్ వేవ్ కేసులు తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. అయితే ఇది తాత్కాలికమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా పంజా విసరడం ప్రారంభించింది. ఇండియాలో కూడా కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళనగా మారింది. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం కలవరానికి గురి చేస్తోంది.

దీనిపై గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు కీలక విషయాలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో కరోనా సివియారిటి కేసుల సంఖ్య పెరుగుతోంది అని అన్నారు. సాధారణ సేవలు పెంచాలని చూస్తున్న చూస్తున్న తరుణంలో కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోనే ఉందని.. ఇలాగే ఉంటే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గాంధీలో సాధారణ కేసుల సంఖ్య పెంచడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని అన్నారు. అయితే నాన్ కోవిడ్ కేసుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు.

ప్రస్తుతం గాంధీలో 400 మంది కరోనాతో చికిత్స పొందుతున్నట్లు రాజారావు తెలిపారు. వివాహాలు, పండుగలు, సభలు, జనసమూహం ఏర్పడే చోట్ల కోవిడ్ నిభందనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని రాజారావు అన్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల పెరుగుదల కనిపిస్తోంది.

More News

రెమ్యునరేషన్ వివాదం.. స్టార్ హీరోయిన్ కి పూజా హెగ్డే సపోర్ట్

హీరోయిన్లకు కూడా హీరోలతో సమానంగా పారితోషికం ఉండాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

అఫీషియల్ : రాంచరణ్, శంకర్ మూవీ హీరోయిన్ ఖరారు

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా అగ్ర దర్శకులలో ఒకరైన శంకర్ కాంబోలో చిత్రం రోజు రోజుకూ భారీతనం సంతరించుకుంటోంది.

ఎమ్మార్వో ఆఫీస్ లో ఎన్టీఆర్.. చుట్టూ వాలిపోయిన ఉద్యోగులు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపిస్తే చాలు.. అభిమానులు ఎగబడుతుంటారు.

వైరల్ పిక్: చిరంజీవిని కలసిన 'రచ్చ' డైరెక్టర్.. ఏం జరుగుతోంది ?

ప్రతిభగల కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడం సంపత్ శైలి.

‘జీ 5’ ప్రారంభించిన ఉచిత కరోనా టీకా కార్యక్రమం ‘సంకల్పం’కు అద్భుత స్పందన

‘కల్యాణ వైభోగం’ స్టార్‌ మేఘనా లోకేష్‌, ‘రాధమ్మ కూతురు’ దీప్తీ మన్నేతో ‘ఎనీ టైమ్‌ మనోరంజనం’ (ఏటీయమ్‌) క్యాంపెయిన్‌ ప్రారంభించిన ‘జీ5’.