Omicron BF 7:భారత్‌లో ఒమిక్రాన్ బీఎఫ్.7 కలకలం.... కేంద్రం హై అలర్ట్ , అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో స్క్రీనింగ్

  • IndiaGlitz, [Thursday,December 22 2022]

చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రపంచం ఆందోళనకు గురవుతోంది. దీనిని బట్టి కరోనా ముప్పు ఇంకా పొంచి వుందని, ఈ మహమ్మారి ఇప్పట్లో అంతం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతూ.. మానవాళికి ప్రశాంతతను దూరం చేస్తోంది. తాజాగా చైనాలో కోవిడ్ విస్పోటనానికి కారణమైన ‘‘ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్’’ పలు దేశాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. మనదేశంలోనూ ఈ వేరియంట్ ప్రవేశించింది. ఇప్పటికే గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒక కేసును నిర్ధారించారు. కేసులు వృద్ధి చెందక ముందే.. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ :

బీఎఫ్.7 వేరియంట్ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్ టెస్టులను పెంచింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు అధికారులు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు సైతం ప్రారంభించింది. అయితే కొత్త వేరియంట్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ వంటి కరోనా నిబంధనలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

అసలేంటీ బీఎఫ్.7 వేరియంట్ :

ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.5కి చెందిన సబ్ వేరియంటే బీఎఫ్.7. దీనికి బలమైన ఇన్‌ఫెక్షన్ కలిగించే సామర్ధ్యం కూడా వుంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్‌ఫెక్షన్ కలిగించే గుణం ఈ వేరియంట్‌కు వుందట. చైనాతో పాటు అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల్లోనూ బీఎఫ్ 7 వేరియంట్ వ్యాప్తి చెందుతోందట. ప్రస్తుతం భారత్‌లోనూ ఈ వేరియంట్ అడుగుపెట్టిన నేపథ్యంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

More News

Korameenu: 'కొరమీను' ట్రైలర్.. డిసెంబర్ 31న మూవీ రిలీజ్

విజ‌య‌వాడ‌లో నేర‌స్థుల‌కు సింహ స్వ‌ప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీస‌ర్ మీసాల రాజు అలియాస్ సీతారామ‌రాజు

Khudiram Bose: డిసెంబర్ 22న పార్లమెంట్ సభ్యుల కోసం ‘ఖుదీరామ్ బోస్’ ప్రత్యేక ప్రదర్శన

ఈరోజు మ‌నం అనుభ‌విస్తున్న స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం ఎందరో మ‌హ‌నీయులు వారి ప్రాణాల‌ను తృణ ప్రాయంగా త్య‌జించారు.

Balakrishna: ఆ హీరో అంటే క్రష్ అన్న స్టార్ హీరోయిన్... జయసుధ, జయప్రద, రాశీఖన్నాలతో బాలయ్య ట్రిపుల్ ధమాకా

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ 2’’ (Unstoppable2)

Theater & OTT Releases: ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే... ఒకే రోజు దిగుతున్న రవితేజ, నిఖిల్

కరోనా కారణంగా ఓటీటీ మార్కెట్ బాగా వృద్ధి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఏదైనా కొత్త సినిమా వస్తే చాలు..

Omicron BF 7 Variant : భారత్‌లోకి ప్రవేశించిన బీఎఫ్. 7 వేరియంట్ ... అప్పుడే నాలుగు కేసులు, కేంద్రం అలర్ట్

ప్రస్తుతం చైనాలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీకి సంబంధించిన నిబంధనలు