Omicron BF 7:భారత్‌లో ఒమిక్రాన్ బీఎఫ్.7 కలకలం.... కేంద్రం హై అలర్ట్ , అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో స్క్రీనింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రపంచం ఆందోళనకు గురవుతోంది. దీనిని బట్టి కరోనా ముప్పు ఇంకా పొంచి వుందని, ఈ మహమ్మారి ఇప్పట్లో అంతం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతూ.. మానవాళికి ప్రశాంతతను దూరం చేస్తోంది. తాజాగా చైనాలో కోవిడ్ విస్పోటనానికి కారణమైన ‘‘ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్’’ పలు దేశాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. మనదేశంలోనూ ఈ వేరియంట్ ప్రవేశించింది. ఇప్పటికే గుజరాత్లో రెండు, ఒడిశాలో ఒక కేసును నిర్ధారించారు. కేసులు వృద్ధి చెందక ముందే.. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ :
బీఎఫ్.7 వేరియంట్ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నుంచి దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్ టెస్టులను పెంచింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు అధికారులు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే స్క్రీనింగ్ టెస్టులు సైతం ప్రారంభించింది. అయితే కొత్త వేరియంట్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ వంటి కరోనా నిబంధనలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అసలేంటీ బీఎఫ్.7 వేరియంట్ :
ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.5కి చెందిన సబ్ వేరియంటే బీఎఫ్.7. దీనికి బలమైన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్ధ్యం కూడా వుంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్ఫెక్షన్ కలిగించే గుణం ఈ వేరియంట్‌కు వుందట. చైనాతో పాటు అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల్లోనూ బీఎఫ్ 7 వేరియంట్ వ్యాప్తి చెందుతోందట. ప్రస్తుతం భారత్‌లోనూ ఈ వేరియంట్ అడుగుపెట్టిన నేపథ్యంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com