తెలంగాణలో కొవాగ్జిన్ రెండో డోసు బంద్...

  • IndiaGlitz, [Monday,May 17 2021]

తెలంగాణలో కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. తగినంత నిల్వ లేకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా స్టాక్‌ రానందున 45 ఏళ్లు పైబడినవారికి కొవాగ్జిన్‌ మలి డోసు పంపిణీని ఆపివేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. అయితే మళ్లీ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గత రెండు రోజులుగా కొనసాగడం లేదు. అయితే ఈ కార్యక్రమం నేటి(సోమవారం) నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉంది.

అయితే దీనిని వ్యాక్సిన్ కొరత కారణంగా నిలిపివేశారు. మరోవైపు కొవాగ్జిన్‌ పంపిణీ నిలిచిపోవడంతో.. కొవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు పంపిణీ మాత్రమే కొనసాగనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం లెక్కలు మాత్రం తెలంగాణ వద్ద ఇంకా 6.93 లక్షల డోసులున్నాయని చెబుతోంది. శనివారం నాటికి రాష్ట్రాలకు 20 కోట్లకు పైగా డోసులను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. దీనిలో భాగంగానే తెలంగాణకు 61.41 లక్షల డోసులు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ 54.47 లక్షల డోసులను (వృథాతో కలిపి) వినియోగించింది. కాబట్టి ఇంకా తెలంగాణ ప్రభుత్వం వద్ద 6.94 లక్షల డోసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొవాగ్జిన్‌ తగినంత స్టాక్‌ లేని కారణంగా పంపిణీ నిలిపివేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న స్టాక్‌ అంతా కొవిషీల్డ్‌గానే పరిగణించాల్సి వస్తోంది. ఇక కొవాగ్జిన్‌ను ఎప్పుడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మొదటి డోసు వేసుకుని సెకండ్ డోసుకు సిద్ధమైన వారి పరిస్థితేంటనేది కూడా తెలియాల్సి ఉంది.

More News

2 డీజీ డ్రగ్‌ను నేడు విడుదల చేయనున్న రాజ్‌నాథ్

కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) నేడు అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం

రఘురామకు తీవ్ర గాయాలు..హైకోర్టు డివిజనల్ బెంచ్ ఫైర్

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలుడటం సంచలనంగా మారింది. తనను సీఐడీ పోలీసులు తీవ్రంగా కొట్టారని న్యాయవాదులకు ఎంపీ తెలిపారు.

కాల్ చేయండి.. క్షణాల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ మీ ఇంటికే పంపిస్తాం: సోనూసూద్

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. కాస్తో కూస్తో రాష్ట్ర ప్రభుత్వాలే లాక్‌డౌన్ పెట్టి కరోనా చైన్‌ను తెంపేందుకు కృషి చేస్తున్నాయి.

ఆక్సిజన్ కావాలంటే మాకు ఫోన్ చేయండి: సీపీ మహేష్ భగవత్

కరోనా ఉధృతి మరింత పెరుగుతున్న సమయంలో ఆక్సిజన్ కొరత ప్రాణాలను హరించి వేస్తోంది. సకాలంలో ప్రాణవాయువు అందక కరోనా రోగులు చాలా మంది ఊపిరి వదులుతున్నారు.

తుఫాన్‌ అలర్ట్‌.. 16 నాటికి అత్యంత తీవ్రంగా ‘తౌక్టే’

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది.