తెలంగాణలో కొవాగ్జిన్ రెండో డోసు బంద్...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కొవాగ్జిన్ రెండో డోసు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. తగినంత నిల్వ లేకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా స్టాక్ రానందున 45 ఏళ్లు పైబడినవారికి కొవాగ్జిన్ మలి డోసు పంపిణీని ఆపివేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. అయితే మళ్లీ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గత రెండు రోజులుగా కొనసాగడం లేదు. అయితే ఈ కార్యక్రమం నేటి(సోమవారం) నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉంది.
అయితే దీనిని వ్యాక్సిన్ కొరత కారణంగా నిలిపివేశారు. మరోవైపు కొవాగ్జిన్ పంపిణీ నిలిచిపోవడంతో.. కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు పంపిణీ మాత్రమే కొనసాగనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం లెక్కలు మాత్రం తెలంగాణ వద్ద ఇంకా 6.93 లక్షల డోసులున్నాయని చెబుతోంది. శనివారం నాటికి రాష్ట్రాలకు 20 కోట్లకు పైగా డోసులను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. దీనిలో భాగంగానే తెలంగాణకు 61.41 లక్షల డోసులు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ 54.47 లక్షల డోసులను (వృథాతో కలిపి) వినియోగించింది. కాబట్టి ఇంకా తెలంగాణ ప్రభుత్వం వద్ద 6.94 లక్షల డోసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొవాగ్జిన్ తగినంత స్టాక్ లేని కారణంగా పంపిణీ నిలిపివేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న స్టాక్ అంతా కొవిషీల్డ్‌గానే పరిగణించాల్సి వస్తోంది. ఇక కొవాగ్జిన్‌ను ఎప్పుడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మొదటి డోసు వేసుకుని సెకండ్ డోసుకు సిద్ధమైన వారి పరిస్థితేంటనేది కూడా తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com