నిహారిక కోసం కజిన్స్ అంతా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు: నాగబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్య జొన్నలగడ్డతో జరగనున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్ ప్యాలెస్‌లో డిసెంబర్ 9న నిహారిక, చైతన్యల వివాహం జరగనుంది. ఇప్పటికే ఇన్విటేషన్స్ కూడా సిద్ధమయ్యాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ తన భార్య పద్మ చూస్తున్నట్టు నిహారిక తండ్రి నాగబాబు వెల్లడించారు. అలాగే తన కుమారుడు వరుణ్ కూడా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు నాగబాబు వెల్లడించారు. కాగా.. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఉదయ్‌పూర్‌ను ఎంపిక చేసింది.. నిహారిక, చైతన్యలేనని తెలుస్తోంది.
కొన్నేళ్ల క్రితం నిహారిక తన స్నేహితులతో కలిసి ఉదయ్‌పూర్ వెళ్లిందట. అక్కడి లొకేషన్స్‌ని చూసి నిహారిక ఫిదా అయ్యిందట. తన వివాహం ఉదయ్‌పూర్‌లోనే చేసుకోవాలని అప్పుడే మెగా డాటర్ డిసైడ్ అయ్యిందట. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం అవసరమైన ప్రదేశాల ఎంపిక కోసం నిహారిక, చైతన్య, వరుణ్‌లు పలు చర్చలు నిర్వహించిన మీదట చివరకు ఉదయ్‌పూర్‌ను ఎంపిక చేశారట. ప్రస్తుత పరిస్థితుల కారణంగా పెద్ద సంఖ్యలో అతిథులను పిలిచి వివాహం చేయడమనేది చాలా కష్టమని భావిస్తున్నట్టు నాగబాబు వెల్లడించారు. పెళ్లికి ముందే వచ్చే అతిథులందరికీ కరోనా టెస్ట్ చేయిస్తామని తెలిపారు. ఈ పెళ్లి వేడుక కోసం ఈవెంట్ కోసం వెడ్డింగ్ ప్లానర్‌లా మారిన తన కుమారున్ని చూస్తే చాలా గర్వంగా ఉందని నాగబాబు పేర్కొన్నారు.
‘‘వివాహానికి సంబంధించి రెస్పాన్సిబులిటీ మొత్తం వరుణ్ తీసుకుని.. చాలా జాగ్రత్తగా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే నా పుట్టినరోజును కూడా వరుణ్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. తన ప్లానింగ్, ఆర్గనైజింగ్ అంతా చాలా నైపుణ్యంతో చేస్తాడు. అంత క్వాలిటీతో పని చేయాలంటే నాకైతే చాలా సమయం పడుతుంది. తన చెల్లిని వరుణ్ ఎంతగానో ఇష్టపడతాడు కాబట్టి ప్రతి ఒక్కటి ఆమె ఇష్టానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. కాబట్టి నాకు పెద్దగా పని లేకుండా పోయింది’’ అని నాగబాబు పేర్కొన్నారు.
వివాహ వేడుక మొత్తం తెలుగువారి సంప్రదాయంలోనే జరుగుతుందని.. వరుణ్‌తో పాటు తన కజిన్స్(రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్) పెళ్లికూతురి కోసం ఒక సర్ప్రైజ్ను ప్లాన్ చేశారు. పెళ్లి రోజు కోసం కుటుంబం మొత్తం ఎదురు చూస్తోంది. ‘‘అది మాకొక ఎమోషనల్, స్పెషల్ మూమెంట్. కాబట్టి మేమంతా ఆ రోజును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని భావిస్తున్నాం. మేమంతా ఒక వారం ముందే వివాహం జరిగే ప్రదేశానికి చేరుకుని అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తాం’’ అని నాగబాబు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments