నయనతార చిత్రం విడుదలను ఆపమన్న కోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
నయనతార సినిమా అనగానే హీరో ఎవరు అని అడిగే కాలం ఎప్పుడో కొండెక్కింది. ఇప్పుడు ఆమే సూపర్‌స్టార్. అయితే ఈ లేడీ సూపర్‌స్టార్ నటించిన `కొలైయుదిర్ కాలం` చిత్రం విడుదలను ఆపమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నయనతార ప్రధాన పాత్రలో చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `కొలైయుదిర్ కాలం`. ఈ సినిమాకు సంబంధించిన వేడుకలోనే నయనతారను నటుడు రాధారవి కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, మద్రాసు హైకోర్టులో ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ పిటిషన్ నమోదైంది. దర్శకుడు బాలాజీ కుమార్ ఈ పిటిషన్‌ను వేశారు.
దివంగత రచయిత సుజాతా రాసిన నవల `కొలైయుదిర్ కాలం` హక్కులను తాను కొనుగోలు చేశానని, ఇప్పుడు అదే పేరుతో సినిమా రావడం తనకు అభ్యంతరమని ఆ పిటిషన్లో దర్శకుడు బాలాజీ కుమార్ పేర్కొన్నారు. ఆయన పిటిషన్‌ను విచారించిన మద్రాసు హై కోర్టు సినిమా విడుదలను బ్యాన్ చేస్తూ ఇంటెరిమ్‌ను పాస్ చేసింది. చిత్ర నిర్మాత మదియళగన్ ఈ విషయమై తమకు ఈ నెల 21 లోపు వివరణ ఇవ్వాలని తెలిపింది.
సో ఈ వారం నయన్ సినిమా వస్తుందో, లేదో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com