నయనతార చిత్రం విడుదలను ఆపమన్న కోర్టు
- IndiaGlitz, [Tuesday,June 11 2019]
నయనతార సినిమా అనగానే హీరో ఎవరు అని అడిగే కాలం ఎప్పుడో కొండెక్కింది. ఇప్పుడు ఆమే సూపర్‌స్టార్. అయితే ఈ లేడీ సూపర్‌స్టార్ నటించిన 'కొలైయుదిర్ కాలం' చిత్రం విడుదలను ఆపమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నయనతార ప్రధాన పాత్రలో చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కొలైయుదిర్ కాలం'. ఈ సినిమాకు సంబంధించిన వేడుకలోనే నయనతారను నటుడు రాధారవి కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, మద్రాసు హైకోర్టులో ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఓ పిటిషన్ నమోదైంది. దర్శకుడు బాలాజీ కుమార్ ఈ పిటిషన్‌ను వేశారు.
దివంగత రచయిత సుజాతా రాసిన నవల 'కొలైయుదిర్ కాలం' హక్కులను తాను కొనుగోలు చేశానని, ఇప్పుడు అదే పేరుతో సినిమా రావడం తనకు అభ్యంతరమని ఆ పిటిషన్లో దర్శకుడు బాలాజీ కుమార్ పేర్కొన్నారు. ఆయన పిటిషన్‌ను విచారించిన మద్రాసు హై కోర్టు సినిమా విడుదలను బ్యాన్ చేస్తూ ఇంటెరిమ్ను పాస్ చేసింది. చిత్ర నిర్మాత మదియళగన్ ఈ విషయమై తమకు ఈ నెల 21 లోపు వివరణ ఇవ్వాలని తెలిపింది.
సో ఈ వారం నయన్ సినిమా వస్తుందో, లేదో వేచి చూడాల్సిందే.