'కె.జి.యఫ్' సినిమాకు షాక్ ఇచ్చిన కోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ `కె.జియఫ్`. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అందులో `కె.జి.యఫ్ చాప్టర్ 1` ఇప్పటికే విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం `కె.జి.యఫ్ చాప్టర్ 2` షూటింగ్ జరుగుతుంది. లేటెస్ట్గా ఈ యూనిట్‌కి కోర్టు షాకిచ్చింది. ఇప్పుడు `కె.జి.యఫ్ చాప్టర్ 2` షూటింగ్ కోలార్ ఫీల్డ్స్‌లోని సైనైడ్ హిల్స్‌లో జరుగుతుంది. దీని వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు. కేసుని పరిశీలించిన కోర్టు సినిమా షూటింగ్‌ను ఆపమని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌ను ఆపు చేసిన యూనిట్ లొకేషన్స్ వేటలో బిజీ బిజీగా ఉంది. కె.జి.యఫ్ పార్ట్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడు అధీరా పాత్రలో నటిస్తున్నారు. ప్రధాని ఇందిరా పాత్రలో రవీనాటాండన్ నటిస్తారని వార్తలు వినింపించాయి.
గత ఏడాది డిసెంబర్లో విడుదలైన `కె.జి.యఫ్ చాప్టర్ 1` కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. హోంబలే బ్యానర్‌పై భారీ బడ్జెట్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాకీ భాయ్‌గా యష్ రాకింగ్ పెర్ఫామెన్స్‌తో రూ.200కోట్ల మేరకు సినిమా వసూళ్లను సాధించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. కె.జి.యఫ్ పార్ట్ 1 సాధించిన సక్సెస్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నిర్మాతలు ఈ అంచనాలకు ధీటుగా సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకరెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు భారీగా ప్లాన్ చేస్తున్నారు. యష్ తదుపరి సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తాడనే వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout