పృథ్వీకి కోర్టులో చుక్కెదురు...

  • IndiaGlitz, [Thursday,June 29 2017]

థ‌ర్టీ ఇయ‌ర్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అంటూ చిన్న చిన్న వేషాలు వేసిన క‌మెడియ‌న్ పృథ్వీ ఇప్పుడు వ‌న్ ఆఫ్ ది లీడింగ్ క‌మెడియ‌న్‌గా మారారు. వ్య‌క్తిగ‌త విష‌యానికి వ‌స్తే పృథ్వీ త‌న భార్య శ్రీల‌క్ష్మితో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా దూరంగా ఉంటున్నాడు. ఇటీవ‌ల కాలంలో పృథ్వీరాజ్ త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని, మాన‌సికంగా వేధిస్తున్నార‌ని సెక్ష‌న్ 498ఊ గృహ హింస చ‌ట్టం క్రింద పోలీసుల‌కు పిర్యాదు చేశారు.
అంతే కాకుండా ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించింది. జ‌న‌వ‌రి నుండి కేసు విజ‌య‌వాడ ఫ్యామిలీ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. భ‌ర్త ఆదాయ వివ‌రాల‌ను కోర్టుకు తెలియ‌జేసిన శ్రీల‌క్ష్మి త‌న‌కు నెల‌కు ప‌ది ల‌క్ష‌లు భ‌ర‌ణం ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే కేసును పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్ నెల‌కు శ్రీల‌క్ష్మికి 8 లక్ష‌లు చెల్లిచాల‌ని తీర్పు చెప్పింది.