తమన్నాకు కోర్టు నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
మిల్కీబ్యూటీ తమన్నాకు కోర్టు నోటీసుల రూపంలో షాక్ తగిలింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే తమన్నా భాటియాకు కోర్టు నోటీసులు రావడమేంటి? అనే సందేహం సగటు ప్రేక్షకుడికి రాక మానదు. వివరాల్లోకి వెళితే ఆన్ గేమ్స్‌లో భాగమైన రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీలపై తిరువనంతపురం(కేరళ) హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ లిస్టులో తమన్నా కూడా ఉండటం గమనార్హం. తమన్నాతో పాటు మలయాళ నటుడు అజు వర్గీస్, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిలకు కూడా కోర్టు నోటీసులను జారీ చేసింది.
ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సైట్స్‌ను బ్యాన్ చేయాలని కోరుతూ త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు తమన్నా, విరాట్ అజు వర్గీస్‌లకు నోటీసులను జారీ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో తమన్నా సీటీమార్ సినిమాతో పాటు గుర్తుందా శీతాకాలం, అందాధున్ తెలుగు రీమేక్, ఎఫ్3 సినిమాల్లో నటిస్తుంది. ఇది కాకుండా లెవన్త్ అవర్ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. బాలీవుడ్ లో బోలే చూడియా సినిమాలో నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments