'వంగ వీటి'పై కోర్టులో కేసు.... నోటీసులు జారీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు విజయవాడ నగరంలో జరిగిన వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకుని సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వంగవీటి. దేవినేని, వంగవీటి కుటుంబాలకు మధ్య జరిగిన గొడవలేంటి? దాని కారణంగా ఏమైందనే పరిస్థితులను తెరపై చూపడానికి రాంగోపాల్ వర్మ సిద్ధమయ్యారు. అయితే వంగవీటి రాధ ఈ సినిమాపై హైకోర్టులో పిటిషన్ వేశారు. రాంగోపాల్‌వర్మ తెరకెక్కిస్తోన్న వంగవీటి సినిమా వాస్తవాలకు విరుద్ధంగా సినిమా ఉందంటూ వంగవీటి రాధ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు. నిర్మాత రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. `వంగవీటి` సినిమా ఆడియో డిసెంబర్ 3న విడుదలవుతుంటే సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout