మహేష్ , కొరటాలకు కోర్టు సమన్లు.....
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. గ్రామాలను దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పుడు వివాదం నెలకొంది. శ్రీమంతుడు కథ తనదేనంటూ శరత్ చంద్ర అనే వ్యక్తి నాంపల్లి కోర్టను ఆశ్రయించాడు. చచ్చేంత ప్రేమ అని తాను రాసిన నవలను తన అనుమతి లేకుండా సినిమాగా తీసి కాపీ రైట్ చట్టాన్ని అతిక్రమించారని కేసు వేశాడు. కేసును స్వీకరించిన కోర్టు మహేష్, కొరటాల శివ, నిర్మాతలను కోర్టుకు హాజరు కావాలంటూ కోరింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments