రజనీకాంత్ పై కర్ణాటకలో కేసు..
- IndiaGlitz, [Wednesday,March 30 2016]
సూపర్ స్టార్ రజనీకాంత్ పై కర్ణాటకలో కేసు నమోదైంది. ఇంతకీ రజనీకాంత్ పై కేసుకు గల కారణం ఏమిటంటే....తమ అభిమాన హీరో సినిమా రిలీజైందంటే చాలు అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇక రజనీకాంత్ సినిమా రిలీజైతే అభిమానుల హంగామా ఓరేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజైతే రజనీ కటౌట్లుకు భారీ ఎత్తున పాలాభిషేకం చేస్తుంటారు.
ఇలా రజనీకాంత్ కటౌట్లకు పాలాభిషేకం చేయడం వలన పాలు వృధా అవుతున్నాయని డా. ఐ. యం. యస్. మణివన్న రజనీకాంత్ కు వ్యతిరేకంగా బెంగళూరు కోర్టులో ఇన్ జంక్షన్ సూట్ ఫైల్ చేశారు. అభిమానులకు ఇలా పాలు వృధా చేయవద్దని రజనీ ఆదేశించాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు రజనీకాంత్ కి నోటిసు పంపించింది. మరి...రజనీకాంత్ ఈ విషయం పై ఎలా స్పందిస్తారో.. చూడాలి.