బిగ్‌బాస్-3 కోఆర్డినేటర్ టీమ్‌కు బెయిల్ మంజూరు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బిగ్‌బాస్-3 షోపై పలు వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే వివాదాల మధ్యే షో ప్రారంభమైనప్పటికీ కేసులు మాత్రం కొలిక్కిరాలేదు. తమను బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా ఫైనల్ చేసి అగ్రిమెంట్కూడా చేసుకుని.. షోలోకి తీసుకోలేదని ఆరోపిస్తూ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీగుప్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే పిల్‌ను బుధవారం నాడు విచారించిన నాంపల్లి కోర్టు బిగ్‌బాస్ కోఆర్డినేటర్ టీమ్ సభ్యులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కాగా.. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బిగ్‌బాస్ టీమ్ సభ్యులు అభిషేక్, రవికాంత్, రఘు ఉన్నారు. వీరందరికీ బుధవారం నాడు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారంలో శ్వేతా, గాయాత్రి ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే గత ఆదివారం నుంచి షో విజయవంతంగా ప్రారంభమైనది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout