డ్రంకెన్ డ్రైవ్ కేసులో యంగ్ హీరోకు కోర్టు జరిమానా.. వార్నింగ్!
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అనేక మంది సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకూ అడ్డంగా బుక్కవుతున్నారు. అయితే సమాజంలో ఓ గుర్తింపు ఉన్న సినీ నటులు సైతం ఇలా బుక్కవుతుండటం గమనార్హం. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్‌లు.. కమెడియన్స్ ఇలా పలువురు పోలీసులు చిక్కిపోయిన విషయం విదితమే. అయితే తాజాగా.. బిగ్‌బాస్ ఫేం, టాలీవుడ్ యంగ్ హీరో కమ్ ఆర్టిస్ట్ ప్రిన్స్ సుశాంత్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయాడు. ఇవాళ.. నగరంలోని కూకట్పల్లి కోర్టు సుశాంత్‌కు ఐదువేల రూపాయిలు జరిమానా విధించింది. అంతేకాదు.. జడ్జి గట్టిగా మందలించి ఇంకోసారి రిపీట్ అయితే జైలుకే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే.. తాను చేసిన తప్పుని ఒప్పుకున్న ప్రిన్స్.. మరోసారి ఇలాంటివి రిపీట్ చేయనని చెప్పారని తెలుస్తోంది. డ్రంక్ డ్రైవ్ విషయంలో పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికి వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు.
పూర్తి వివరాల్లోకెళితే.. ఈనెల 24న బాచుపల్లిలో విఎన్ఆర్ కాలేజీ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో సుశాంత్ అడ్డంగా దొరికిపోయాడు. ఒకట్రెండు కాదు ఏకంగా 48 పాయింట్లు బ్రీత్ అనలైజర్‌లో రాగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో ఇవాళ కూకట్పల్లి కోర్టుకు సుశాంత్ హాజరయ్యాడు. ‘నీకు నాకు డాష్ డాష్’, ‘బస్‌స్టాప్’, ‘రొమాన్స్’, ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ వంటి చిత్రాల్లో నటించిన సుశాంత్ టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments