Kavitha: కవితకు వరుస ఎదురుదెబ్బలు.. సీబీఐ విచారణకు కోర్టు అనుమతి..

  • IndiaGlitz, [Friday,April 05 2024]

లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కవితను విచారిస్తామని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపినన న్యాయస్థానం విచారణకు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఆమెను ప్రశ్నించేందుకు ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నించే సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాలతో త్వరలోనే అధికారులు కవితను విచారించనున్నారు.

గతంలో కవితను విచారించిన సమయంలో నమోదు చేసిన స్టేట్‌మెంట్, అప్రూవర్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ముఖ్యంగా భూముల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ కవితను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. దీంతో కవిత నుంచి మరింత సమాచారం రాబట్టిన తర్వాత మరో ఛార్జీషీటు దాఖలు చేసే అవకాశముంది. ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా.. ఈడీ తరపున జోసెఫ్ హుస్సేన్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారం ఉదయానికి రిజర్వ్ చేసింది. అలాగే సాధారణ బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని పేర్కొంది.

కాగా మార్చి 15న లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండగా తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి మారారు. ఇందులో భాగంగా తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర అని రూ.100కోట్లు చేతులు మారాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా అరెస్టై తిహార్ జైలులోనే ఉంటున్నారు.

More News

తెలంగాణలోని అసైన్డ్ భూముల కబ్జా వివాదంలో టీడీపీ నేత

తెలుగు రాష్ట్రాల్లో ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా దాని వెనక తెలుగుదేశం పార్టీ నేతల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవినీతిపరులందరూ ఆ పార్టీలోనే ఉంటారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలే హస్తం పార్టీ కండువా కప్పుకోగా.. తాజాగా బీజేపీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.

Sharmila: హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలి: షర్మిల

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలని ప్రజలకు పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు.

Chandrababu: చంద్రబాబుకు భారీ షాక్.. ఎన్నికల సంఘం నోటీసులు..

ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు మరో 40 రోజులు మాత్రమే ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నాయి.

YSRCP: ఏపీలో వైసీపీ సునామీ ఖాయం.. ప్రముఖ జాతీయ సర్వేలో స్పష్టం..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.