'కొరియర్ బాయ్ కళ్యాణ్' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
ఇష్క్`, గుండెజారి గల్లంతయ్యిందే` వంటి హిట్స్ తో ట్రాక్ లోకి వచ్చిన నితిన్ చిన్నదాన నీకోసం` చిత్రంతో ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే రెండున్నరేళ్ళ క్రితం గౌతమ్ మీనన్ సమర్పణలో గురు ఫిలిమ్స్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై యంగ్ హీరో నితిన్, యామీ గౌతమ్ జంటగా రూపొందుతోన్న సినిమా కొరియర్ బాయ్ కల్యాణ్`. ప్రేమ్ సాయి దర్శకుడు.
ఈ సినిమాని సెప్టెంబర్ 11న విడుదల చేయాలనుకున్న నిర్మాతలు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో సినిమాని సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నారనే సంగతి విదితమే. తాజా సమచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎటువంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ పొందిందట. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా విడుదలకు అన్నీ మార్గాలు క్లియర్ అయినట్టే. ఇప్పుడు నిర్మాతలు సినిమాని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 17న విడుదల చేయడం కన్ ఫర్మ్ అయినట్టే. అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com