బిగ్‌బాస్: మహేశ్ సారీ చెప్పినా వినని కపుల్స్.. శ్రీముఖి ఫసక్ !!
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ ఎపిసోడ్-05లో తన భార్య వితికకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటూ వరుణ్ సందేశ్.. ఫన్‌బకెట్ ఫేమ్ మహేశ్ విట్టాకు వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే. అయితే ఈ వ్యవహారం ఆరో ఎపిసోడ్‌లోనూ కంటిన్యూ అయ్యింది. మహేశ్ సారీ చెప్పినప్పటికీ ఏ మాత్రం తగ్గని వితిక్ అండ్ వరుణ్ మరింత రెచ్చిపోయారు. అయితే కాసింత తగ్గిన మహేశ్ మళ్లీ గొడవ కు ఫుల్‌స్టాప్ పెట్టి ‘దటీజ్ మహేశ్’ అనిపించుకున్నాడు.
ఆరో ఎపిసోడ్‌లో అసలేం జరిగింది..!
గురువారం జరిగిన వివాదంపై శుక్రవారం నాడు మహేశ్ వివరణ ఇచ్చుకున్నాడు. ‘నేను వితికాను ఒక చెల్లెలుగా భావించే చనువు తీసుకుని పో.. అన్నానంతే. అంతకుమించి నా మనస్సులో వేరే ఉద్దేశం లేదు’ అని మహేశ్ చెప్పగా.. వరుణ్, వితికలు సారీ చెప్పాలని పట్టుబట్టారు. అంతేకాదు వీరిద్దరికి పలాయి మాదిరిగా శ్రీముఖి సైతం రియల్ కపుల్స్‌కే సపోర్ట్ చేసింది. దీంతో చేసేదేమీ లేక.. చేయడానికేమీ లేక.. కోపాన్ని అనుచుకుని నిగ్రహం అంటూ సారీ చెప్పే ప్రయత్నం చేశాడు. ‘నాది సీమ కావడం వల్ల యాస అలాగే వస్తుంది.. ‘పో’ అనే మాట వల్ల నువ్ హర్ట్ అయ్యింటే.. నా తప్పు ఉన్నా లేకపోయినా సారీ చెప్తాను’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు. అయితే ‘సారీ నాకు వద్దు’ అంటూ మళ్లీ వితిక బుంగ మూతి పెట్టుకుని గొడవకు దిగింది. దీంతో మళ్లీ రచ్చ రచ్చ అయ్యింది.
మళ్లీ మహేశ్ వర్సెస్ వరుణ్!
మహేశ్..: నేను ఇంత తగ్గి చెప్తున్నా.. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు (కేకలేస్తూ..)
వరుణ్: నన్ను బ్రో అనకు.. వరుణ్ అని పిలువు సరేనా. మేం అంతా గేమ్ ఆడుతుంటే.. నువ్ ఒక్కడివే నేను యాక్టింగ్ చేయను.. అది ఇదీ అంటున్నావ్.. మేమంతా ‘హౌలా గాళ్లమా’!
మహేశ్ : ‘వరుణ్.. సారీ ’ అని చెప్పడంతో ఈ చెత్త వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్లైంది.
హైలైట్‌గా నిలిచిందేంటి!
ఈ వారం ఎలిమినేషన్‌లో ఆరుగురు.. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉన్నారు. మొదట ‘కళాకారులం.. మేం కళాకారులం’ అనే స్కిట్ అందర్నీ ఆకట్టుకున్నారు. రెండు టీమ్‌లుగా విడిపోయారు. ఇందులో శ్రీముఖి స్కూల్, భాస్కర్ స్కూల్ అని రెండున్నాయి.
అబ్బనీ తీయని దెబ్బ.. ఫసక్!
శ్రీముఖి స్కూల్‌లో..: వరుణ్, వితిక, రవిక్రిష్ణ, రోహిణి, హేమ, పునర్నవి, అషు సభ్యులుగా ఉండగా.. ‘అబ్బనీ తీయని దెబ్బ’ అంటూ రవిక్రిష్ణ, రోహిణిలు స్టెప్పులతో రచ్చ చేశారు. రోహిణి అయితే వీరలెవల్లో పెర్ఫామెన్స్ చేసింది. ఫైనల్‌గా శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి ‘ఓన్లీ వన్స్ ఫసక్’ అంటూ మోహన్ బాబు డైలాగ్‌తో అందర్నీ ఆకట్టుకుంది.
‘రంగస్థలం’తో వీర లెవల్లో..!!
భాస్కర్ స్కూల్‌లో..: అలీ రాజా, మహేష్ విట్టా, రాహుల్, బాబా భాస్కర్, జాఫర్, సావిత్రి, హిమజలు సభ్యులుగా ఉన్నారు. రైతు, పల్లెటూరు నేపథ్యంలో హార్ట్ టచ్చింగ్ పెర్ఫామెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. రైతుగా మారిన మహేశ్ ‘రంగస్థలం’ టైటిల్ సాంగ్ పాడుతూ దుమ్ముదులిపేశాడు. ఈ స్కిట్ ద్వారాలో తనలోని నటుడు, గాయకుడు, దర్శకుడ్ని బయటకు తీశాడు. ఆ తర్వాత అలీ, బాబా భాస్కర్, రాహుల్, సావిత్రి, హిమజ, జాఫర్‌లు కూడా స్కిట్‌లో భాగమై హార్ట్ టచ్చింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చి సందేశాత్మకంగా నిలిచారని చెప్పుకోవచ్చు.
అయితే నేడు కింగ్ నాగార్జున రానుండటంతో ఎవరి పరిస్థితేంటో అన్నది తెలియరాలేదు. మన్మథుడు ఎవరికి ఎలా క్లాస్ పీకుతారో..? ఈ మొత్తం వ్యవహారంలో ఎవర్ని ఎలిమినేషన్‌ను తప్పించుకున్నారో..? ఎవరు సేఫ్‌జోన్‌లో ఉన్నారో..? అనేది ఇవాళ తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout