close
Choose your channels

Sacrificial Ritual:షుద్రపూజల కోసం దంపతుల ఆత్మహత్య.. మిషన్‌తో శిరచ్ఛేదం, తలలు హోమ గుండంలో పడేలా ఏర్పాట్లు

Monday, April 17, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నా.. ఇంకా దేశంలో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. నరబలులు, క్షుద్రపూజలు, మంత్రాలు అనే వార్తలు నిత్యం ఏదో మూల వినిపిస్తూనే వుంటాయి. నిధుల కోసమని, పిల్లల కోసమని, జీవితంలో పురోగతి కోసమని దొంగ బాబాలు , మంత్రగాళ్లు చెప్పే మాటలు నమ్మి కొందరు ఎదుటి వారి ప్రాణాలను తీసేస్తున్నారు. ఇందులో కన్నబిడ్డల్ని చంపుకున్న వాళ్లు కూడా వున్నారు. తాజాగా గుజరాత్‌లో భార్యాభర్తలిద్దరూ తలలు నర్కుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పొలంలో గుడిసె వేసి నిత్యం పూజలు :

వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ జిల్లాలోని వించియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతులను హేంభాయ్ మక్వానా (38), అతని భార్య హన్సాబెన్ (35)గా గుర్తించారు. సంఘటనాస్థలిలో వీరు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు తాంత్రిక పూజల కోసం ఏకంగా సొంత పొలంలోనే ఓ గుడిసెను నిర్మించుకున్నారు. అనంతరం తమ ప్రాణాలను బలిచ్చారు. ఇందుకోసం తలను నరుక్కునేందుకు ప్రత్యేక యంత్రాన్ని (గెలిటిన్ మిషన్ ) తెప్పించి.. దాని ద్వారా తమ ప్రాణాలను బలిచ్చారు. అంతేకాదు.. ఈ యంత్రం ద్వారా తమ తలలు తెగిపోయాక, అవి నేరుగా హోమ గుండంలో పడే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.

తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన పిల్లలు :

దంపతులిద్దరూ శనివారం రాత్రి ఆదివారం మధ్యాహ్నం వరకు తాంత్రిక పూజలు చేశారని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఏడాది కాలంగా వీరిద్దరూ పూజలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు వున్నారని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రుల మరణంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment