దేశంలో 20 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. వరుసగా ఏడో రోజు కూడా..
- IndiaGlitz, [Thursday,August 06 2020]
దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. వరుసగా ఏడవ రోజు సైతం కరోనా కేసులు 50 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 56,282 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,64,596కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 904 మంది మృతి చెందగా... ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 40,699కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 5,95,501 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుంచి ఇప్పటి వరకూ 13,28,337 మంది బాధితులు కోలుకున్నారు.