దేశంలో 13 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు..

  • IndiaGlitz, [Friday,July 24 2020]

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల్లో ప్రస్తుతం మూడో స్థానంలో ఇండియా కొనసాగుతోంది. రోజురోజుకూ షాకింగ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశానికి సంబంధించిన కరోనా బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో కేసులు 13 లక్షలకు చేరువవుతుండగా.. కరోనా మరణాలు 30 వేలు దాటాయి.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసలు 12,87,945 కి చేరుకున్నాయి. తాజాగా కరోనాతో 740 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు మొత్తంగా 30,601 మంది మృతి చెందారు. ప్రస్తుతం 4,40,135 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,17,209 మంది డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది..

More News

దేశంలో 18 కోట్ల మందికి కరోనా.. షాకింగ్ విషయాలు చెప్పిన థైరోకేర్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మరోవైపు ఇండియాలో కరోనా మరింత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది.

‘బిచ్చగాడు 2’ ఫస్ట్‌లుక్ విడుదల

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన విజ‌య్ ఆంటోని.. హీరోగా,నిర్మాత‌గా నకిలీ’ సినిమాను నిర్మించారు.

హోం ఐసోలేషన్‌లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

తెలంగాణలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సునిశిత్ స్టార్ తెలుసా? అంటే పెద్దగా ఎవరికీ తెలియదు కానీ శాక్రిఫైసింగ్ స్టార్ అంటే మాత్రం తెలియని వారుండరు.

షాకింగ్.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 7998 కేసులు

ఏపీలో షాకింగ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఏపీకి సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.