దేశంలో 13 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల్లో ప్రస్తుతం మూడో స్థానంలో ఇండియా కొనసాగుతోంది. రోజురోజుకూ షాకింగ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశానికి సంబంధించిన కరోనా బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో కేసులు 13 లక్షలకు చేరువవుతుండగా.. కరోనా మరణాలు 30 వేలు దాటాయి.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసలు 12,87,945 కి చేరుకున్నాయి. తాజాగా కరోనాతో 740 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు మొత్తంగా 30,601 మంది మృతి చెందారు. ప్రస్తుతం 4,40,135 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 8,17,209 మంది డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout