తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్కరోజే..

  • IndiaGlitz, [Monday,June 22 2020]

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 730 కేసులు నమోదవడం షాక్‌కు గురి చేస్తోంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా 3297 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 730 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. మూడు నెలల్లో ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 659 కేసులు నమోదవడం గమనార్హం.

ఆ తరువాత జనగాంలో అత్యధికంగా 34 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి పరిధిలో 10 కేసులు నమోదయ్యాయి. కాగా తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకూ 7802కు చేరకుంది. నిన్న ఒక్కరోజే 7 గురు మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటి వరకూ 210కి చేరుకుంది.

More News

వ‌ర్మ‌పై అమృత ఘాటు వ్యాఖ్య‌లు

ప‌రువు హ‌త్య‌ల్లో సంచ‌ల‌నం రేపింది ప్ర‌ణ‌య్ హ‌త్య‌. మిర్యాల‌గూడ‌లో జరిగిన ఈ హ‌త్యలో ప్ర‌ణ‌య్ భార్య అమృత తండ్రి మారుతీరావు దోషి.

సరిహద్దులో ఉద్రిక్తత.. ఆర్మీకి రూ.500 కోట్లు

త్రివిధ దళాల అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లను కేటాయించింది.

ఏపీలో నేడూ కొనసాగిన కరోనా విజృంభణ

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా తాజా కేసుల బులిటెన్‌ను విడుదల చేసింది.

ఈనాడు సిబ్బందికి కరోనా టెస్ట్.. షాకింగ్ రిజల్ట్

కరోనా మహమ్మారి నేడు అన్ని సంస్థలకూ పాకింది. ముఖ్యంగా కరోనాను అరికట్టడంలో ఫ్రంట్ లైన్‌లో ఉన్న వారిలో హెల్త్, పోలీస్, జీహెచ్ఎంసీతో పాటు మీడియా కూడా ఉంది.

కరోనాతో విజయ ఆస్పత్రి డైరెక్టర్ మృతి

చెన్నైలోని ప్రసిద్ధి గాంచిన విజయ ఆస్పత్రి డైరెక్టర్ శరత్ రెడ్డి(43) కరోనాతో చనిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం విజయ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.