షాకింగ్ : మహబూబ్ నగర్లో పచ్చడితో కరోనా!
Send us your feedback to audioarticles@vaarta.com
వేసవికాలం వచ్చిందంటే అవకాయ పచ్చడి పెట్టుకోని తెలుగువారు ఉండరు.. అన్నంలోకి ఆవకాయ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. ఇప్పుడంతా కరోనా కష్ట కాలం కావడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి వచ్చి పచ్చడి కాయలు కోసుకోవడానికి.. అందుకు సామాగ్రి కొని తెచ్చుకోవడానికి కూడా నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త లాక్డౌన్ సమయంలో ఊరంతటికీ ఏదైనా సాయం చేద్దాం అనుకున్నాడు. వెంటనే కొంత డబ్బు విరాళంగా రావడంతో మామిడి తొక్కు పెట్టి ఊరంతా పంచాలని నిర్ణయించుకున్నాడు.
ఇదీ అసలు కథ..
షాద్‌నగర్‌కి చెందిన తన బంధువైన వ్యాపారిని మే-18న ఆశ్రయించాడు. ఊరందరికీ పచ్చడి సఫ్లై చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని గ్రామసభ పెట్టి ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. రెండ్రోజుల తర్వాత షాద్‌నగర్ నుంచి మామిడి తొక్కు పెట్టేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను తన ఊరికి రప్పించాడు. ఒక రోజంతా మొత్తం 12 మంది సమక్షంలో 2 క్వింటాళ్ల తొక్కు పెట్టారు.. ఈ పచ్చడిని అంతా దాన్ని రుచి చూశారు కూడా. అన్ని పనులు అయ్యాక తొక్కును ప్యాక్‌చేసి ఊరంతా పంచేశారు. తీరా చూస్తే.. ఈ కార్యక్రమం జరిగిన రోజే షాద్‌నగర్ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తొక్కు పెట్టిన ఇద్దరికీ మరుసటి రోజు పాజిటివ్ అని తేలింది. విషయం తెలిసిన ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఊర్లోని అందరికీ వణుకు మొదలైంది. అయితే అప్పటికే తిన్నవాళ్లు.. తినని వాళ్లందరూ ఆ తొక్కును డంప్ యార్డులో పడేసి ఇళ్లంతా శుభ్రం చేసేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఊర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అధికారులు చెప్పినా..
గ్రామస్థలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి తగు చర్యలు తీసుకోవాల్సింది పోయి వారు అసలే పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. దీంతో ఆ ఇద్దరు ఎవరితో కాంటాక్ట్ అయ్యారు.. అని గ్రామస్థులు మొత్తుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ఊర్లోని 4 వేలకు పైగా జనంలో ఇప్పటికే 100 మందికి పైగా హోమ్ క్వారంటైన్లో ఉన్నారని తెలియవచ్చింది. అసలు ఎవరికి వైరస్ సోకిందో..? ఎవరికి సోకలేదో తెలియక అంతా మానసికంగా భయపడిపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం అప్రమత్తమై టెస్ట్‌లు చేయకుంటే ఊరంతా వల్లకాడుగా మారుతుందని గ్రామస్థులు మొత్తుకుంటున్నారు.
గ్రామం అంతా నిర్మానుష్యం..
అధికారులపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రంగంలోకి దిగి.. ఆ ప్రజాప్రతినిధి ఇంట్లో పచ్చడి పట్టటానికి సహాయం చేయటానికి ఎవరెవరు? అనేదానిపై ఆరా తీస్తున్నారు. వెంటనే గ్రామంలో ఉండే అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలన్నింటినీ మూసివేయించేశారు. ప్రస్తుతం గ్రామం అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. కాగా కరోనా బాధితుడు ఉస్మానియా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయకుండానే బయటపడ్డాడని తెలియవచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments