కరోనా మళ్లీ మళ్లీ సోకవచ్చు: లండన్ కింగ్స్ కాలేజ్
- IndiaGlitz, [Tuesday,July 14 2020]
కరోనా మళ్లీ సోకుతుందో.. లేదో అనే సందేహాలకు లండన్లోని కింగ్స్ కాలేజ్ పరిశోధనలు చెక్ పెట్టాయి. కరోనా ఒక సాధారణ జలుబు మాదిరిగా మళ్లీ మళ్లీ సోకవచ్చని పరిశోధకులు వెల్లడించారు. మన బాడీలో రోగ నిరోధక శక్తికి కారణమైనవి ప్రోటీన్లు. ఇవి యాంటీబాడీలుగా పని చేస్తాయి. కరోనాపై పోరాటంలోనూ కీలకంగా పని చేస్తాయి. అయితే ఒకసారి కరోనాకు గురైన వ్యక్తి ఆ వైరస్ నిరోధక శక్తిని దాదాపు మూడు నెలల వ్యవధిలోనే కోల్పోతున్నారని.. దీని ఫలితంగా మళ్లీ మళ్లీ కరోనా సోకే అవకాశముందని కింగ్స్ కాలేజ్ పరిశోధనల్లో వెల్లడైంది.
కాగా.. ఈ పరిశోధనలు.. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారు చేస్తున్న తరుణంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినప్పటికీ అది ఒకసారి వేయించుకుంటే సరిపోదని ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. యాండీబాడీలు మూడు నెలల్లో తగ్గి పోతున్నాయంటే.. వ్యాక్సిన్ కూడా మూడు నెలలకోసారి వేయించుకోవాల్సిందేనని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ కేటీ దురేన్ తెలిపారు. అయితే రెండోసారి కరోనా సోకితే తీవ్రత తక్కువగా ఉండొచ్చని వ్యాధి నిరోధకత నిపుణులు చెబుతున్నారు.