షాకింగ్ : ఏపీలో కరెన్సీ ద్వారా ఇద్దరికి కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. మరోవైపు కరోనా మహమ్మారిపై ప్రభుత్వం మాత్రం తీవ్రస్థాయిలో పోరు చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వార్త విన్న ఏపీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇంతకీ ఆ షాకింగ్ విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలా వచ్చింది..!?

నిన్న మొన్నటి వరకూ కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందుతోందంటే చాలా వరకు జనాలు, అధికారులు అబ్బే అదేం లేదని లైట్ తీసుకున్నారు. అయితే తాజాగా.. ఏపీలోని గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించగా ఇది అక్షరాలా నిజమేనని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం క్రయవిక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌కు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని అధికారులు తేల్చారు.

వారిద్దరూ ఎక్కడికీ ప్రయాణించలేదని.. ఎవరికీ కాంటాక్ట్ కాలేదని అయినా కరోనా రావడంతో లోతుగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ద్వారా వైరస్ వ్యాపించిందని అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు పాజిటివ్ కేసులు రాష్ట్ర ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. డబ్బులు ఇచ్చుపుచ్చుకునేవారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.

తస్మాత్ జాగ్రత్త..

వాస్తవానికి కరోనా వైరస్‌ అనేది ఎక్కువగా చేతుల్లోనే తిష్టవేసి ఉంటుందని అధికారులు ఎప్పట్నుంచో చెబుతున్న విషయం విదితమే. అందుకే తరుచుగా సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని పదే పదే వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా.. కంప్యూటర్‌ను ఆన్‌ చేయడం, బాత్‌రూంకు వెళ్లేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్‌ ఎక్కిదిగినప్పుడు డోర్ల ఆపరేషన్‌, స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయడంతో పాటు చాలా పనులు చేతులతో చేయాల్సి ఉంటుంది. అలా ఒకరి చేతిలోని వైరస్‌ మరొకరి చేతిలోకి విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు, వైద్యులు, అధికారులు చెబుతున్నారు. తస్మాత్ జాగ్రత్త.. తరచూ చేతులను సబ్బుతో కడుక్కుంటే మన ఆరోగ్యం మనచేతిలో ఉన్నట్లే.. లేదంటే అంతే సంగతులు!

More News

‘కమ్మవారు తలచుకుంటే జగన్ లేచిపోతాడు..!’

కరోనా నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతల నోళ్లకు మూత పడట్లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు ఏమేం చేయాలి..? ఎలా ముందుకెళ్లాలి..?

ఆంగ్ల మాధ్యమం: జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజకీయాలు అస్సలు ఆగట్లేదు. అధికార పార్టీ మాత్రం దీన్నే అలుసుగా చేసుకుని చేయాల్సినవన్నీ చేసేద్దామని భావిస్తుంటే..

మే-03 వరకు ఇవన్నీ పాటించాల్సిందే.. కేంద్రం హెచ్చరిక

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో మే-03 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే.

మూడోసారి అదే మ్యూజిక్ డైరెక్టర్‌తో నాని

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. త‌న 25వ సినిమా `వి` ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో విడుద‌ల కాలేదు.

రీమేక్‌లో ర‌వితేజ‌?

ఈ మ‌ధ్య ర‌వితేజ జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌కు ఓకే చెప్పేస్తున్నాడు. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు. ఇప్పుడు ర‌వితేజ హీరోగా గోపీచంద్