తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కరోనా వ్యాక్సిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వ్యాక్సిన్ తెలుగు రాష్ట్రాలకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్‌తో తెలంగాణకు బయలుదేరిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రావల్సిన విమానం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తెలంగాణకు 31 బాక్సుల్లో 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆ బాక్సులను కోఠిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తరలిస్తున్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక కంటైనర్‌లో తరలించనున్నారు.
అలాగే ఏపీకి 4.7 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులపే తీసుకొచ్చారు. ఈ వ్యాక్సిన్‌ను గన్నవరంలోని శీతలీకరణ కేంద్రానికి అధికారులు తరలించనున్నారు. దీని కోసం వ్యాక్సిన్ నిల్వ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు 44 క్యూబిక్ మీటర్ సామర్థ్యం కలిగిన ప్రత్యేక ఫ్రీజర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గన్నవరం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించనున్నారు. తొలి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఈ వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout