హైదరాబాద్, బెంగళూరుకు పాకిన కరోనా వైరస్!!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ బారీన పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా రోజురోజుకు దేశాలు దాటి వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో కేరళలో ఏడుగురు భారతీయులను పరీక్షించారు. చైనా నుండి తిరిగి వచ్చిన ఏడుగురు జ్వరం, దగ్గు మరియు గొంతు నొప్పితో కూడిన లక్షణాలు ఉన్నట్లు కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఏడుగురిలో రెండు కొచ్చిలో, నాలుగు తిరువనంతపురం, త్రిస్సూర్, కోజికోడ్, పతనమిట్టాలో ఉన్నాయి. ఇది కాకుండా, కేరళలోని వారి ఇళ్లలో 73 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు సమాచారం.
మరోవైపు.. ముంబైలో ఇద్దరు, బెంగళూరు, హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి వైద్య పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా వచ్చిందని సమాచారం. ఈ నెలలో చైనా, హాంకాంగ్ నుంచి 20,000 మంది ప్రయాణికులు తిరిగి రావడంతో, న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఒక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి, ఏవైనా అనుమానాస్పద కేసులకు చికిత్స అందించడానికి సిద్ధంగా ఉంచడం జరిగింది. ఇదిలా ఉంటే.. థాయ్‌లాండ్, వియత్నాం, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, నేపాల్, ఫ్రాన్స్ మరియు యుఎస్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా 1,300 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments