కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లో పుట్టిందే..!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కచ్చితంగా ల్యాబ్‌లో తయారుచేసిన కృత్రిమ వైరసా? అంటే అవుననే అంటున్నారు యూరోపియన్ శాస్త్రవేత్తలు. వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా ఉద్భవించిందంటూ ఇప్పటి వరకూ ఎన్నో విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. కరోనా తొలి కేసులు సైతం వూహాన్ ల్యాబ్‌కు సమీపంలోని సీఫుడ్ మార్కెట్‌లోనే వెలుగు చూశాయి. ఇంత కాలానికి యూరోపియన్ శాస్త్రవేత్తలు కచ్చితమైన ఆధారాలతో మీడియా ముందుకు వచ్చారు. ఇంత కచ్చితంగా చెప్పేందుకు తమ వద్ద బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని యూరోపియన్ శాస్త్రవేత్తలు బిర్గర్ సోరెన్సన్ (నార్వే), అంగుస్ దల్‌గ్లీష్ (బ్రిటన్) చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆనందయ్య మందుతో కోలుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ మృతి
2002 నుంచి 2019 సంవత్సరం నవంబరు నెలాఖరు వరకు వూహాన్ ల్యాబ్‌లో వైర్‌స్‌లపై జరిగిన పరిశోధనల వివరాలు, అక్కడ సంభవించిన సంఘటనల విశ్లేషణ ఆధారంగానే ఈ నిర్ధారణకు వచ్చామని సదరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా.. దీనిని గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్టు నమ్మించేందుకు ‘రివర్స్ ఇంజినీరింగ్’కు యత్నించినట్టు తెలిపారు. ఇంతటి సంచలన విషయాలను బ్రిటన్‌కు చెందిన ‘డైలీ మెయిల్’ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వారు వెల్లడించారు. అలాగే దీనిపై తాము రూపొందించిన 22 పేజీల పరిశోధనా పత్రం ‘క్వార్టర్లీ రివ్యూ ఆఫ్ బయో ఫిజిక్స్ డిస్కవరీ’ (క్యూఆర్‌బీ- డిస్కవరీ) జర్నల్‌లో త్వరలోనే ప్రచురితం కానుందని తెలిపారు.
ఇలా గుర్తించారు..
కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు చేసిన పరిశోధనలో భాగంగా.. చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ జన్యుక్రమాన్ని ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు విశ్లేషించారు. కరోనా వైరస్‌ను అభివృద్ధి చేసే క్రమంలో వైరస్‌పై అధ్యయనం చేస్తుండగా బిర్గర్ సోరెన్సన్, అంగుస్ దల్‌గ్లీష్‌లు ఒక ఆశ్చర్యకరమైన అంశాన్ని గుర్తించారు. వైరస్‌లోని అమైనో యాసిడ్ల అమరిక చాలా భిన్నంగా ఉండటంతో సందేహం కలిగింది. కృత్రిమంగా తయారు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని వారు బలంగా నమ్మారు. కృత్రిమ వైరసేనా? కాదా? అనే దాన్ని నిర్ధారణ చేసుకునేందుకు సదరు శాస్త్రవేత్తలు 2002 నుంచి 2019 వరకు వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌లో వైరస్‌లపై జరిగిన పరిశోధనల వివరాలను సేకరించి అధ్యయనం చేశారు. అప్పట్లో ఈ వివరాలతో ఒక పరిశోధనా పత్రాన్ని రూపొందించి పలు ప్రముఖ మెడికల్ జర్నల్‌లను సంప్రదించగా.. అవన్నీ దాన్ని ప్రచురించేందుకు నిరాకరించాయి. ఆ తరువాత వారు తమ పరిశోధననకు మరింత ముందుకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే మరో బలమైన ఆధారం వారి చేతికి చిక్కింది. కరోనా వైర్‌సలోని కుడి ఎగువ భాగంలో ‘కే528, కే529’, ‘ఆర్355, కే356, ఆర్357’, ‘కే535, కే537’, ‘కే558, కే557’ అనే నాలుగు రకాల అమైనో యాసిడ్లలోనే వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తల పనితనం దాగి ఉందని గుర్తించారు. ఈ నాలుగు రకాల అమైనో యాసిడ్లు వైరస్‌లోని స్ప్రైక్ ప్రోటీన్‌పై ధనావేశం కలిగి ఉన్నాయి. దీనివల్ల మానవ శరీరంలోని రుణావేశ భాగాలకు బలంగా అతుక్కోవడానికి వీలుంటుందని చెప్పారు. అలాగే సహజసిద్ధంగా ఉద్భవించే వైరస్‌లలో పాజిటివ్ చార్జ్ కలిగిన అమైనో యాసిడ్లు.. ఒకే వైపు వరుస క్రమంలో అమరి ఉండటం అసాధ్యం. భౌతిక శాస్త్ర నియమాలకు కూడా అది పూర్తిగా విరుద్ధం. కానీ ఇందులో అందుకు భిన్నంగా అమైనో యాసిడ్లు వరుసగా పేర్చి ఉండటం కచ్చితంగా .. వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు చేసిన పనే అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు పరిశోధనా పత్రంలో అభిప్రాయపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments