కలకలం.. తెలంగాణ వ్యక్తికి తొలి కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే పలు దేశాలకు పాకిన ఈ వైరస్ భారత్‌కూ పాకడంతో పాటు.. తెలుగు రాష్ట్రాలకూ వచ్చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు జంకుతున్నారు. దీన్ని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఇరు రాష్ట్రాల్లో ఇక్కడున్న వ్యక్తులకు రాలేదు కానీ.. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే సోకింది.
జంకుతున్న జనం!
తాజాగా.. తొలిసారిగా తెలంగాణకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల దుబాయ్ నుంచి ఓ వ్యక్తికి టెస్ట్‌లు చేయగా ఈ నెల 14న కరోనా పాజిటివ్ రాగా ఆయన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనతో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తాజాగా తేలింది. అంటే.. తెలంగాణ తొలి పాజిటివ్ కేసు ఇదేనన్నమాట. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా హైదరాబాదీలు భయంతో జంకిపోతున్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు..? ఎలా వచ్చింది..? విషయాలు మాత్రం పూర్తిగా తెలియరాలేదు. మొత్తానికి చూస్తే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 21కి చేరిందని హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం ఈ విషయాన్ని తెలియజేసింది.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే..
ప్రపంచవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 11,400 మంది మరణించగా.. సాయంత్రానికి ఒక్కసారిగా ఈ మరణాల సంఖ్య 11,842కు చేరడం గమనార్హం. అంటే గంటకు గంటకూ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 84వేల 712 కరోనా కేసులు నమోదవ్వగా.. 93,576మంది కోలుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండియా విషయానికొస్తే.. కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 298కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో నలుగురు మృతి చెందారు. ఇదిలా ఉంటే.. 22 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com