ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ కట్టడి కోసం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన చివరి దశ ప్రయోగాలను భారీ స్థాయిలో చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సిన్‌ను ముక్కు ద్వారా అందించనున్నారు. బారత్‌కు చెందిన ఫార్మా సంస్థలు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్ బయోటెక్ సంస్థలు ప్రాథమిక దశ ట్రయల్స్‌ను చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. దీనికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియ(డీసీజీఐ) అనుమతి లభించాల్సి ఉంది.
ఆఖరి దశ ప్రయోగాల్లో భాగంగా 30 వేల నుంచి 40 వేల మంది వలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కొద్దినెలల్లో దేశంలో ‘ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్’ అందుబాటులోకి రావొచ్చని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. మరోవైపు రష్యాకి చెందిన కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు అనుమతులు లభించినట్టు డాక్టర్ రెడ్డీస్ సంస్థ వెల్లడించింది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇలాంటి సమయంలో ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను తాము చేపట్టనున్నట్టు భారత్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments