ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్..

  • IndiaGlitz, [Monday,October 19 2020]

కరోనా వైరస్ కట్టడి కోసం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన చివరి దశ ప్రయోగాలను భారీ స్థాయిలో చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సిన్‌ను ముక్కు ద్వారా అందించనున్నారు. బారత్‌కు చెందిన ఫార్మా సంస్థలు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్ బయోటెక్ సంస్థలు ప్రాథమిక దశ ట్రయల్స్‌ను చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. దీనికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియ(డీసీజీఐ) అనుమతి లభించాల్సి ఉంది.

ఆఖరి దశ ప్రయోగాల్లో భాగంగా 30 వేల నుంచి 40 వేల మంది వలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కొద్దినెలల్లో దేశంలో ‘ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్’ అందుబాటులోకి రావొచ్చని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. మరోవైపు రష్యాకి చెందిన కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు అనుమతులు లభించినట్టు డాక్టర్ రెడ్డీస్ సంస్థ వెల్లడించింది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయని డబ్ల్యూ‌హెచ్‌వో వెల్లడించింది. ఇలాంటి సమయంలో ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను తాము చేపట్టనున్నట్టు భారత్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

More News

'క‌ల‌ర్ ఫొటో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా

టీడీపీ కమిటీలను ప్రకటించిన చంద్రబాబు.. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్న..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ కమిటీలను ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని ప్రకటించిన చంద్రబాబు..

డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలిగిపోయింది.

సీఎం కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం..

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. ఐదేళ్ల క్రితం పిన తల్లి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురై..

ప్రేక్షకులు ఒకటి తలిస్తే.. బిగ్‌బాస్ మరొకటి తలిచాడు

మంచి జోష్ ఉన్న సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వెంటనే సండే ఫన్‌డే స్టార్ట్ చేశారు. నోయెల్ సంచాలక్‌గా డాట్స్ గేమ్‌ను నాగ్ స్టార్ట్ చేశారు.