‘కరోనా టీకాతోనే నటుడు వివేక్ మృతి’

  • IndiaGlitz, [Sunday,April 18 2021]

కరోనా టీకా కారణంగానే ప్రముఖ నటుడు వివేక్ మ‌ృతి చెందారని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశారు. ఆయన టీకా కారణంగా మరణించలేదని ఎలా నిర్ధారిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన వివేక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. కరోనా కేసుల సంఖ్య పత్రికల్లో వేయడం నిలిపివేయాలన్నారు. కేసుల సంఖ్యను వేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అడిగే వారు లేరనా? అంటూ మండిపడ్డారు. దేశంలో కరోనా పరీక్షలు నిలిపివేయాలని మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశారు.

వివేక్ బాగానే ఉన్నారని.. అలాంటప్పుడు ఎందుకు కరోనా టీకా వేశారని ప్రశ్నించారు. ఆ టీకాలో సామర్థ్యమేంటని నిలదీశారు. దేశంలో కరోనా లాంటి వైరస్‌లు చాలా ఏళ్లుగా ఉన్నాయని ప్రస్తుతం కరోనా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మన్సూర్ అలీఖాన్ విమర్శించారు. టీకాతోనే వివేక్‌ మరణించలేదని ఎలా నిర్ధారిస్తారని.. ఎవరు చెబుతారని ప్రశ్నించారు. తొండాముత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసిన తాను ప్రచారంలో భిక్షగాళ్ల పక్కన, కుక్క పక్కన సైతం కూర్చున్నానని... అలాంటి తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు. నాకు కరోనా రాలేదే? మాస్క్‌లు వేసుకోమని ఎందుకు చెబుతున్నారంటూ మండిపడ్డారు. మనం వదిలే గాలి మంచిది కాదని చెబుతున్నారని.. మరి అలాంటి గాలినే మాస్క్ వేసుకుంటే తిరిగి పీల్చాల్సి వస్తుందిగా అన్నారు.

కరోనా లేదని మన్సూర్ అలీఖాన్ స్పష్టం చేశారు. షూటింగ్‌లకు కరోనా సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడంతో, ఈ టెస్ట్‌కు రూ.2 వేలు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. అంత స్థోమత లేని జూనియర్‌ ఆర్టిస్టులు ఉపాధి కోల్పోయి రోడ్లపై పడ్డారన్నారు. కరోనా టీకా వేయించుకొనే వారందరికి ఇన్యూరెన్స్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాధి నిరోధక శక్తి పెంచేలా పారంపర్యమైన మూలికల కషాయాలను ప్రజలకు ఉచితంగా, విరివిరిగా అందించాలని సూచించారు. కరోనా పేరిట ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతూ ప్రభుత్వాలు కాలం గడుపుతున్నాయని విమర్శించారు. ఇది ఏమాత్రం సరికాదని... పరిష్కారించాల్సిన చోట సమస్యను పెంచుతున్నారంటూ మన్సూర్ అలీఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More News

సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన నటుడు నరేష్

ప్రముఖ సినీ నటుడు సీనియర్ నరేష్.. స్టోన్ ఇన్‌ఫ్రా కంపెనీ యజమానిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

B.కాంలో ఫీజిక్స్" ట్రైలర్ ను విడుదల చేసిన  ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి

రెడ్ కార్పెట్ రీల్ ప్రొడక్షన్ పతాకంపై అంకిత, అవంతిక, మేఘన,నగరం సునీల్,జబర్దష్ అప్పారావు నటీ నటులుగా సామ్ జె చైతన్య స్వీయ దర్శకత్వంలో

మళ్లీ లాక్‌డౌన్ భయం.. ఇంటి బాట పడుతున్న వలస కూలీలు

మాయదారి కరోనా రెట్టింపు వేగంతో విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది లక్ష కేసులంటేనే జనం భయపడ్డారు.

టాలీవుడ్‌లో విషాదం.. పూజా ఎమోషనల్ ట్వీట్

టాలీవుడ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కో డైరెక్టర్ సత్యం కన్నుమూశారు.

నేటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్‌గా గాంధీ..

రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం, మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో..