ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్: సీరం సంస్థ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం సంస్థ సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గురువారం జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమిట్-2020లో ఆయన మాట్లాడుతూ.. ఆక్స్‌ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఫిబ్రవరి 2021 నాటికి తొలుత హెల్త్‌కేర్ వర్కర్లకు, వయసు పైబడిన వారి కోసం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అలాగే సామాన్య ప్రజల కోసం ఏప్రిల్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని అదర్ పూనావాలా ప్రకటించారు.
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయడం కోసం బ్రిటన్-స్వీడన్ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో పుణెకు చెందిన సీఐఐ ఒప్పందం చేసుకుంది. కాగా.. ఈ టీకాకు సంబంధించిన తుది దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఇండియాలో మొదలైన సంగతి తెలిసిందే. కాగా సీరమ్ సంస్థ మన దేశంలో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డిసెంబర్‌లో అనుమతి చేసుకుంటుంది. జనవరిలో అనుమతులు లభిస్తే అనుకున్న సమయానికి వ్యాక్సిన్‌ను అందజేయగలుగుంది. అయితే వ్యాక్సిన్ విడుదల అనేది బ్రిటన్‌లో నిర్వహిస్తున్న క్లినికల్ ఫలితాలపై ఆధారపడి ఉంటుందని అదర్ పూనావాలా వెల్లడించారు.
కాగా.. ఈ వ్యాక్సిన్ ధరను సైతం అదర్ పూనావాలా ప్రకటించారు. వ్యాక్సిన్ రెండు డోసులకు గానూ దాదాపుగా రూ.1000 వరకూ ఉండొచ్చని పూనావాలా తెలిపారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి నాలుగు కోట్ల డోసులను సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ వయో వృద్ధుల్లో, యువతలో సమానంగా రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని సంస్థ సీఈవో తెలిపారు. నియంత్రణ సంస్థల నుంచి వెంటనే ఆమోదం లభిస్తే.. వచ్చే ఏడాది జనవరి లోపు ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చే అవకాశం ఉందని అదర్ పూనావాలా పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments